అతను
ABN , First Publish Date - 2023-10-30T00:49:39+05:30 IST
నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు అతను. ఇసుక మెత్తదనానికి కాళ్ళు లొంగిపోయి కదల్లేక కొన్నాళ్ళ అంకెలతో మొదలై కొన్నేళ్లు వరకు...
అతను
నడుస్తూ నడుస్తూ
ఆగిపోయాడు అతను.
ఇసుక మెత్తదనానికి
కాళ్ళు లొంగిపోయి కదల్లేక
కొన్నాళ్ళ అంకెలతో మొదలై
కొన్నేళ్లు వరకు-
తనలో కణంకణం
ఉద్వేగ గాలులకు
గులకరాళ్ళ నునుపుకు
ఉప్పుప్పు తనానికి
తేలి వచ్చే పేరులేని పరిణామాలకు
అడ్డుముఖమై నిలుచున్నాడు.
అలలు దాటి
తూఫాన్లు కాదని
కాలాల మార్పులు మధ్యలో
కుదురుకున్నట్టు లోకానికి
వేదనపడ్డట్టు అన్వేషికి
నిశ్చయించుకున్నట్టు సాధకుడికి
విభిన్నరూపాల ఏకాకిగా
నిలబడ్డాడు...
అనాది నాగరికతలు
పురాస్మృతులు లాంటి
పైపెచ్చులు ఊడినా...
నీలిమ
నిశి మేఘం
గాఢమై నలుపు
సింధూరపు బొట్టు
భళ్లున వెలుగు...
ప్రాణం పొంది కదిలాడు అతను.
ధీరజ్ కశ్యప్ వేముగంటి