మృత్యుంజయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2023-02-05T23:38:08+05:30 IST

మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయ పున: నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

మృత్యుంజయస్వామి ఆలయంలో ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన
మూలవిరాట్‌కు పూజలు చేస్తున్న ఎంపీ నామ, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజు

మధిర, ఫిబ్రవరి 5: మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయ పున: నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అందులో బాగంగా ఆదివారం ధ్వజస్తంభం, పలు విగ్రహాల ప్రతిష్ఠాపన పలువురు వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. భక్తుల శివనామస్మరణతో వీధులు మారుమ్రోగాయి. ఐదు రోజులపాటు జరిగిన పూజా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా 50వేల మంది భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కాంగ్రెస్‌ నాయకురాలు అమ్మఫౌండేషన్‌ చైర్మన్‌ మల్లు నందిని పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్న ఎంపీ నామా ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పబ్బతి రమేష్‌, బత్తుల శ్రీనివాసరావు, పరిశా శ్రీనివాసరావు, సంపసాల కోటేశ్వరరావు, రెడపంగి గోపాలరావు, గుండాల రాధ, దేవాదాయశాక అధికారి కొత్తూరు జగన్‌మోహన్‌రావు, ఆలయ ప్రధాన అర్చకులు రాయప్రోలు వెంకట సత్యనారాయణశర్మ, పలువురు పండితులు పాల్గొన్నారు. టౌన్‌ ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-02-05T23:38:26+05:30 IST