ఈ వారం వివిధ కార్యక్రమాలు 01 10 2023
ABN , First Publish Date - 2023-10-02T00:44:53+05:30 IST
జీవిత సాఫల్య పురస్కారం, ఎం.ఎస్.ఆర్ సాహితీ పురస్కారం, పాలమూరు సాహితి, ‘పిడికెడు మట్టి’ నవల, ‘ప్రేరణ’ పరిచయ సభ, ‘కె.ఎస్. విరుదు’ పురస్కారం...
జీవిత సాఫల్య పురస్కారం
కవిత విద్యా సంస్కృతిక సేవా సంస్థ ఈ ఏడాదికి జీవిత సాఫల్య పురస్కారాన్ని కథకుడు షేక్ హుసేన్ సత్యాగ్నికి ప్రకటిం చింది. పురస్కారం ప్రదానం పది వేల నగదు, శాలువాతో అక్టోబరు 15న కడప లోని సిపి బ్రౌన్ లైబ్రరీలో జరుగుతుంది.
అలపర్తి పిచ్చయ్య చౌదరి
ఎం.ఎస్.ఆర్ సాహితీ పురస్కారం
కథా రచనలో, బాలసాహిత్యంలో కృషి చేస్తున్న సమ్మెట ఉమాదేవి 2023కిగాను ఎం.ఎస్.ఆర్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలో హైదరాబాదులో జరిగే సభలో రూ.5వేల నగదు పుర స్కారంతోపాటు సత్కారం ఉంటుంది.
మలిశెట్టి శ్యాంప్రసాద్
పాలమూరు సాహితి
పాలమూరు సాహితి అవార్డుకు 2022 సంవత్సరానికి జెల్ది విద్యాధర్‌రావు రచిం చిన ‘అంతరంగపు భాష’ కవితాసంపుటి ఎంపికైంది. అవార్డు ప్రదానోత్సవ కార్య క్రమం అక్టోబరు 2 ఉ.10గంటలకు కాళోజీహాల్, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్, మహబూబ్‌నగర్‌లో జరుగుతుంది. కార్య క్రమంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, వల్లపురెడ్డి మనోహర్ రెడ్డి, స్వర్ణసుధాకర్ రెడ్డి, దార్ల వేంకటేశ్వరరావు, కోట్ల వెంక టేశ్వరరెడ్డి హాజరవుతారు.
భీంపల్లి శ్రీకాంత్
‘పిడికెడు మట్టి’ నవల
సృజన సాహితీ నల్లగొండ ఆధ్వర్యంలో బండారు శంకర్ రచించిన ‘పిడికెడు మట్టి’ నవల ఆవిష్కరణ అక్టోబర్ 15న నల్లగొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. సభలో బెల్లి యాదయ్య, పెరుమాళ్ళ ఆనంద్, గింజల నరసింహారెడ్డి, అంపశయ్య నవీన్, సుంకి రెడ్డి నారాయణరెడ్డి, మునాసు వెంకట్, కదిరె కృష్ణ, కార్టూనిస్ట్ శంకర్, వేనేపల్లి పాండురంగారావు, బండారు దానయ్య తదితరులు పాల్గొంటారు.
సాగర్ల సత్తయ్య
‘ప్రేరణ’ పరిచయ సభ
మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వ ర్యంలో విల్సన్ రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు’పై వచ్చిన పీఠికలు, విశ్లేషణల సంకలనం ‘ప్రేరణ’ పరిచయ సభ అక్టోబరు 8 ఉ.10 గంటలకు విజయవాడలో జరుగు తుంది. సభలో ఎం. ప్రభాకర్, పెను గొండ లక్ష్మీనారాయణ, జి.లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొఒటారు.
కలిమిశ్రీ
‘కె.ఎస్. విరుదు’ పురస్కారం
కోయంబత్తూరులోని విజయ రీడర్స్ సర్కిల్ అందిస్తున్న ‘కె.ఎస్. విరుదు’ అనువాద పురస్కారాన్ని జిల్లేళ్ళ బాలాజీ స్వీకరిస్తారు. ఈ అనువాద పురస్కార ప్రదాన సభ అక్టోబరు 8న కోయంబత్తూరులో జరుగుతుంది. సభలో సన్మానం, జ్ఞాపికతో పాటు పురస్కా రంగా రూ.50వేల నగదు బహుమతి ప్రదానం జరుగుతుంది.
విజయ రీడర్స్ సర్కిల్