ఈ వారం వివిధ కార్యక్రమాలు 14 08 2023

ABN , First Publish Date - 2023-08-14T00:18:30+05:30 IST

గద్దర్‌ పై వ్యాసాలకు ఆహ్వానం, సమకాలీన, చారిత్రక, సైన్స్‌ఫిక్షన్‌ ఇతివృత్తాలతో కథల పోటీ, అద్దేపల్లి పురస్కారం, ‘ఎప్పటికీ... అందరికీ.. సంజీవదేవ్‌’, సప్తతి వేడుకలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 14 08 2023

గద్దర్‌ పై వ్యాసాలకు ఆహ్వానం,

గద్దర్‌ జీవితం, సాహిత్యం, ఉద్యమ ప్రస్థానంపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. మూడు నాలుగు పేజీల్లో రాసి టైపు చేసిన వ్యాసాలను ఆగస్ట్‌ 31లోగా ఈమెయిల్‌: rajaiahnallella@gmail. comకు గానీ, పిడిఎఫ్‌ రూపంలో వాట్సప్‌ నంబరు: 99894 15571కు గానీ పంపాలి.

వరంగల్‌ రచయితల సంఘం

సమకాలీన, చారిత్రక, సైన్స్‌ఫిక్షన్‌ ఇతివృత్తాలతో కథల పోటీ

దీపావళి ప్రత్యేక సంచికకై స్వర్గీయ వాకాటి పాండురంగారావు స్మారక ‘కథల పోటీ - 2023’ నిర్వహిస్తున్నాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహు మతులు వరుసగా: రూ.12వేలు, రూ.7వేలు, రూ.5వేలు. ఎనిమిది కథలకు రూ.1000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు. కథలను మెయిల్‌/పోస్ట్‌లో జాగృతి ఆఫీస్‌కు చేర్చవచ్చు. చివరి తేదీ: సెప్టెంబర్‌ 2. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌: www.jagritiweekly.comలో లభ్యం.

జాగృతి తెలుగు వీక్లీ

అద్దేపల్లి పురస్కారం

అద్దేపల్లి రామమోహనరావు సాహిత్య విమర్శ పురస్కారాన్ని 2023కి గానూ విమ ర్శకుడు మేడిపల్లి రవికుమార్‌ స్వీకరిస్తారు. అద్దేపల్లి జన్మదినం సెప్టెంబర్‌ 9న కాకినాడలో జరిగే సభలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది.

అద్దేపల్లి ఉదయభాస్కరరావు

‘ఎప్పటికీ... అందరికీ.. సంజీవదేవ్‌’

సంజీవదేవ్‌ 25వ వర్ధంతి సందర్భంగా బి.లలితా నంద ప్రసాద్‌ రాసిన ‘ఎప్పటికీ.. అందరికీ.. సంజీవదేవ్‌’ పుస్తకావిష్కరణ సభ ఆగస్టు 19 సా.4గం.లకు రసరేఖ ప్రాంగణం, తుమ్మపూడి, (గుంటూరు జిల్లా)లో జరుగుతుంది. వివరాలకు ఫోన్‌: 92474 99715.

బండ్ల మాధవరావు

సప్తతి వేడుకలు

దేవరాజు మహారాజు ‘సప్తతి’ వేడకలు ఆగస్టు 15 ఉ.10గం.ల నుంచి ఇంద్రజిత్‌ గుప్తా హాల్‌, సి.ఆర్‌.ఫౌండేషన్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌లో జరుగుతాయి. సభలో ఎ.బి.కె. ప్రసాద్‌, సుర వరం సుధాకర్‌ రెడ్డి, సుధామ, జి.వి. రత్నాకర్‌ పాల్గొంటారు. వివరాలకు: 82478 48044.

మానవ వికాస వేదిక

Updated Date - 2023-08-14T00:18:30+05:30 IST