ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 10 2023
ABN , First Publish Date - 2023-10-23T01:36:01+05:30 IST
కార్టూన్ల సంకలనం ఆవిష్కరణ, ‘సారాంశం’ రెండు సంపుటాలు ఆవిష్కరణ, అక్షరాల తోవ కథల పోటీ, కవితలకు ఆహ్వానం...
కార్టూన్ల సంకలనం ఆవిష్కరణ
72మంది తెలుగు కార్టూనిస్టులు పాల్గొన్న సంకలనం ఆవిష్కరణ అక్టోబరు 29 సా.6 గంటలకు నెల్లూరు టౌన్ హలులో జరుగుతుంది. విశాలాక్షి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన పోటీలో గెలుపొందిన 36 కార్టూన్లతో పాటు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కార్టూన్లతో ఈ సంకలనం వెలువడుతుంది. కథ, మినీ కథ, కవితలు, కార్టూన్స్ విజేతలు అందరికీ బహుమతి ప్రదానం జరుగుతుంది. సభలో వాడ్రేవు చినవీరభద్రుడు, ఎమ్వీ రామిరెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఈతకోట సుబ్బారావు
‘సారాంశం’ రెండు సంపుటాలు ఆవిష్కరణ
అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘సారాం శం’ (పరిశోధన గ్రంథాలు - పరిచయ వ్యాసాలు) అనే రెండు సంపుటాల ఆవిష్కరణ ధ్రువ ఫౌండేషన్, మూసీ సాహిత్య ధార సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 28 సా.5గంటలకు తెలంగాణ సారస్వత పరి షత్తు, హైదరాబాదులో జరుగుతుంది. ఈ కార్యక్ర మంలో కె.వి. రమణాచారి, డి. రవీందర్, వెలుదండ నిత్యానందరావు తదితరులు పాల్గొంటారు.
ధ్రువ ఫౌండేషన్, మూసీ సాహిత్య ధార
అక్షరాల తోవ కథల పోటీ
అక్షరాల తోవ పురస్కారం- 2024 కథల పోటీకి ఏ4 సైజులో ఐదు పేజీలు దాటకుండా డిటిపి చేసిన కథలు నవంబరు 30లోగా చిరునామా: రాచమళ్ళ ఉపేందర్, స్టార్ ఆఫ్ సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి ఎదురుగా, ేస్టషన్ రోడ్, ఖమ్మం 507001కు పంపాలి. ఫోన్: 98492 77968. ఎంపికేౖన మూడు ఉత్తమ కథలు ఒక్కో కథకు 2000 చొప్పున నగదు, అక్షరాల తోవ పురస్కారాన్ని పొందుతాయి.
అక్షరాల తోవ
కవితలకు ఆహ్వానం
‘చెన్న’ పేరుతో అంబేద్కరిస్టు రచయిల సంఘం డిసెంబరులో తేనున్న కవితా సంకలనానికి మాల కవులు, రచయితలు ‘మాలల జీవితం, సంస్కృతి, చరిత్ర’ అంశాలపై కవితలు పంపగోరుతున్నాం. కవితలను drramaraoku@gmail.comకు ఈమెయిల్ చేయాలి. వివరాలకు ఫోన్: 81439 00140.
మాలపల్లి ప్రచురణలు