NEET-PG 2023 నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2023-01-11T07:43:57+05:30 IST
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (National Board of Examinations in Medical Sciences) (ఎన్‌బీఈఐఎంఎస్) - నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ - పీజీ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల
పీజీ
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (National Board of Examinations in Medical Sciences) (ఎన్‌బీఈఐఎంఎస్) - నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ - పీజీ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ, ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మార్చి 31 నాటికి ఏడాది వ్యవధిగల ఇంటర్న్‌షిప్ (Internship) పూర్తిచేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.
నీట్ పీజీ 2023 వివరాలు: ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. దీనిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఇస్తారు. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు రావాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు.
ముఖ్య సమాచారం
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.4,250; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,250
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27
ఎడిట్ విండో ఓపెన్: జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు
సెలెక్టివ్ ఎడిట్ విండ్ ఓపెన్: ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడింగ్: ఫిబ్రవరి 27 నుంచి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కోదాడ, అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కావలి, కర్నూలు, ఎమ్మిగనూరు, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, నర్సాపురం, ఒంగోలు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
నీట్ పీజీ 2023 తేదీ: మార్చి 5న
ఫలితాలు విడుదల: మార్చి 31
వెబ్‌సైట్: https://nbe.edu.in
ఎండీఎస్
మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (Master of Dental Surgery) (ఎండీఎస్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ - ఎండీఎస్) 2023 నోటిఫికేషన్ వెలువడింది. దీనిని న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సె్‌స(ఎన్‌బీఈఎంఎస్) నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగానే దేశవ్యాప్తంగా ఉన్న సంబంధిత సంస్థల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) ఉత్తీర్ణతతోపాటు స్టేట్ డెంటల్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలి. మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
నీట్ ఎండీఎస్: దీనిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 240 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ప్రత్యేకించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి.
ముఖ్య సమాచారం
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.4250; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,250
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 30
ఎడిట్ విండో ఓపెన్: ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు
ఫైనల్ ఎడిట్ విండో ఓపెన్: ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడింగ్: ఫిబ్రవరి 22 నుంచి
నీట్ ఎండీఎస్ 2023 తేదీ: మార్చి 1న
ఫలితాలు విడుదల: మార్చి 31న
వెబ్‌సైట్: https://nbe.edu.in