Share News

Education: అనంతపురం జేఎన్‌టీయూఏలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

ABN , First Publish Date - 2023-10-18T16:43:13+05:30 IST

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-పీజీ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్‌ కోటా కింద మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్‌

Education: అనంతపురం జేఎన్‌టీయూఏలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-పీజీ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్‌ కోటా కింద మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్‌ కాలేజీల్లో ఎంటెక్‌ రెగ్యులర్‌, ఎమ్మెస్సీ సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు టీచింగ్‌/ఇండస్ట్రీ/ఆర్‌ అండ్‌ డీ సంస్థల్లో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి. పనిచేస్తున్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ను దరఖాస్తుకు జతచేయాలి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/ఏపీపీజీఈసెట్‌ 2023/ఏపీపీజీసెట్‌ 2023, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షి్‌పలు, స్టయిపెండ్‌లు లభించవు. ఫీ రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు.

ఎంటెక్‌ స్పెషలైజేషన్‌లు-సీట్లు: అనంతపురంలోని జేఎన్‌టీయూఏ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ 6, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌(బ్రిడ్జెస్‌ అండ్‌ టన్నెల్స్‌) 7, ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌ 7, పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌ 7, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ 7, అడ్వాన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ సిస్టమ్స్‌ 7, డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ 7, వీఎల్‌ఎ్‌సఐ సిస్టం డిజైన్‌ 7 కంప్యూటర్‌ సైన్స్‌ 4, నానో టెక్నాలజీ 7 సీట్లు ఉన్నాయి.

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు-సీట్లు: జేఎన్‌టీయూఏ-ఓటీపీఆర్‌ఐ(ఆయిల్‌ టెక్నలాజికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో ఫుడ్‌ టెక్నాలజీ 6 సీట్లు, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 7 సీట్లు ఉన్నాయి.

అర్హత: ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా ఏపీపీజీఈసెట్‌ 2023లో ర్యాంక్‌ సాధించి ఉండాలి.

  • ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఎస్సీ(అగ్రికల్చర్‌/ఫుడ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/హోం సైన్స్‌)/ బీఎస్సీ ఆనర్స్‌ (ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీలో కెమిస్ట్రీతోపాటు ఫుడ్‌సైన్స్‌/బోటనీ/జువాలజీ/ఫిజిక్స్‌/బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/సెరీకల్చర్‌/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ/హార్టికల్చర్‌లలో ఏవైనా రెండు సబ్జెక్టులు చదివినవారు; బీవీఎస్సీ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. ఏపీపీజీసెట్‌ 2023లో ర్యాంక్‌ సాధించి ఉండాలి.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1000

స్పాట్‌ అడ్మిషన్స్‌ తేదీ: అక్టోబరు 20

వేదిక: డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, యూనివర్సిటీ బిల్డింగ్‌ ఆఫ్‌ జేఎన్‌టీయూఏ, అనంతపురం

వెబ్‌సైట్‌: www.jntua.ac.in

Updated Date - 2023-10-18T16:43:13+05:30 IST