Education: మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీడీఎం

ABN , First Publish Date - 2023-09-19T09:26:40+05:30 IST

మేనేజ్‌మెంట్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ)- పీజీడీఎం, పీజీడీఎం - హెచ్‌ఆర్‌ఎం (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌), పీజీడీఎం-ఐబీ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌), పీజీడీఎం-బీఏ(బిజినెస్‌ అనలిటిక్స్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి

Education: మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీడీఎం

మేనేజ్‌మెంట్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ)- పీజీడీఎం, పీజీడీఎం - హెచ్‌ఆర్‌ఎం (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌), పీజీడీఎం-ఐబీ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌), పీజీడీఎం-బీఏ(బిజినెస్‌ అనలిటిక్స్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గుర్గావ్‌ క్యాంపస్‌లో అన్ని ప్రోగ్రామ్‌లు, ముర్షీదాబాద్‌ క్యాంప్‌సలో పీజీడీఎం ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండేళ్ల వ్యవధి గల ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌లు. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) వీటిని ఎంబీఏ డిగ్రీతో సమానంగా గుర్తించింది.

పీజీడీఎం-ఐబీ: ఇది డ్యూయెల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌. దీనిని ఎండీఐ గుర్గావ్‌, ఈఎ్‌ససీపీ యూరప్‌ ఉమ్మడిగా నిర్వహిస్తాయి. మొదటి మూడు టర్మ్‌లు గుర్గావ్‌ క్యాంప్‌స్‌లో చదవాలి. తరవాత రెండు టర్మ్‌లను ఈఎ్‌ససీపీ(పారి్‌స/బెర్లిన్‌/మాడ్రిడ్‌/ ట్యూరిన్‌/వార్షా/లండన్‌) క్యాంపస్‌లో చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉం టుంది. చివరి టర్మ్‌ను గుర్గావ్‌ క్యాంపస్‌లో చదవాలి. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తిచేసినవారికి ఈఎ్‌ససీపీ యూరప్‌ ‘మాస్టర్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌’ డిగ్రీని, గుర్గావ్‌ క్యాంపస్‌ పీజీడీఎం- ఐబీ డిగ్రీని ప్రదానం చేస్తాయి.

అర్హత: పదోతరగతి, ఇంటర్‌ స్థాయుల్లో కనీసం ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. క్యాట్‌ 2023నకు దరఖాస్తు చేసుకొని ఉండాలి. లేదా జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. పీజీడీఎం, పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2024 అక్టోబరు 31 నాటికి సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాలి. పీజీడీఎం-ఐబీలో ప్రవేశానికి కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల వ్యవధి గల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2024 జనవరి 31 నాటికి కనీసం ఏడాది ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి. అప్రెంటి్‌సషిప్‌, ఆర్టికల్‌షిప్‌, ఇంటర్న్‌షి్‌పలను ప్రొఫెషనల్‌ అనుభవం కింద పరిగణించరు. పీజీ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏఐ, ఏఎంఐఈ, సీఎఫ్‌ఏ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్‌ల వివరాలు

పీజీడీఎం, పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం, పీజీడీఎం-బీఏ(బిజినెస్‌ అనలిటిక్స్‌): ఒక్కో ప్రోగ్రామ్‌లో ఆరు టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి మూడు నెలలు. మొదటి నాలుగు టర్మ్‌లలో కోర్‌ కోర్సులు ఉంటాయి. మూడో టర్మ్‌ తరవాత ఎనిమిది నుంచి పది వారాల ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. అయిదు, ఆరు టర్మ్‌లలో అభ్యర్థులు ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌నకు సంబంధించి కనీసం అయిదు ఎలక్టివ్‌లను; అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ, స్ట్రాటజీ అండ్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌నుంచి కనీసం రెండు ఎలక్టివ్‌లను ఎంచుకోవాలి.

స్కాలర్‌షిప్‌లు

  • గుర్గావ్‌ క్యాంప్‌సలో అన్ని ప్రోగ్రామ్‌లకు మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌ కింద పదిమందికి ట్యూషన్‌ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తారు.

  • రెండో సంవత్సరం చదువుతున్నవారికి ఓపీ జిందాల్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.1,50,000 ఇస్తారు.

  • రెండో ఏడాది ప్రోగ్రామ్‌ చివరలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఇద్దరికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కింద ఒక్కొక్కరికి రూ.10,000 ఇస్తారు.

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, క్యాట్‌ 2023 స్కోర్‌/జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 26 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 24

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ సెంటర్‌: హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: www.mdi.ac.in

Updated Date - 2023-09-19T09:26:40+05:30 IST