APSRTC: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2023-08-11T16:21:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయనగరం జోన్... కింద పేర్కొన్న అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయనగరం జోన్... కింద పేర్కొన్న అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు www.app-renticeshipindia.gov.in/ వెబ్‌సైట్‌లో ఆగస్టు 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.
విజయనగరం జోన్ పరిధిలోని జిల్లాలు: తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం.
ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్.
అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: ఆగస్టు 18
విశాఖపట్నం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: ఆగస్టు 19
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేదీ: ఆగస్టు 21
ధ్రువపత్రాలు పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ, జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరం.