Election results: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభం..
ABN , First Publish Date - 2023-03-02T08:15:34+05:30 IST
ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.
త్రిపుర: ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ (Tripura, Meghalaya and Nagaland results) ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపును అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు ఈవీఎంలు చేరుకున్నాయి.
కాగా ఈ మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్, మేఘాలయల్లో ఒక్కో సీటు ఏకగ్రీవమవ్వడంతో 59 స్థానాలకే పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
నాగాలాండ్‌లో అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. త్రిపురలో బీజేపీ తమ ప్రత్యర్థుల కంటే పూర్తి పైచేయి సాధింస్తుందని, మేఘాలయాలో గెలుపు దిశగా బీజేపీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. సోమవారంనాడు మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్టిట్ పోల్ ఫలితాలను న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి.
మేఘాలయ
అరవై మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ 21-26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 8-13 సీట్లు, బీజేపీ 6-11 సీట్లు, కాంగ్రెస్ 3-6 సీట్లు గెలుచుకుంటాయని జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్‌పీపీకి 18-24, కాంగ్రెస్ 6-12, బీజేపీ 4-8, యూడీపీ 8-12, టీఎంసీ 5-9 సీట్లు వస్తాయి. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌పీపీ 18-26, ఏఐటీఎంసీ 8-14, యూడీపీ 8-14 బీజేపీ 3-6 సీట్లు గెలుస్తాయి.
నాగాలాండ్
60 సభ్యుల నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 38 నుంచి 48 సీట్లు, కాంగ్రెస్ 1-2 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 35 నుంచి 42 సీట్లు గెలుచుకుంటుంది. ఈటీజీ-టైమ్స్ నౌ పోల్ ప్రకారం ఎన్‌డీపపీ 27-33, బీజేపీ 12-16, ఎన్‌పీఎఫ్ 4-8 సీట్లు గెలుచుకుంటాయి.
త్రిపురలో...
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 36 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 6-11 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టిప్ర మోతా పార్టీకి 9-16 సీట్లు వస్తాయని తెలిపింది. జీన్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ-ఐపీఎఫ్‌టీ 29-36 సీట్లు గెలుచుకుంటాయి. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 13-21 సీట్లు, టిప్ర మోతా పార్టీకి 11-16 సీట్లు వస్తాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల కౌటింగ్ మార్చి 2న జరుగుతుంది.