Home » Election Results
జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ..
హర్యానా ఫలితాలపై స్పందించిన జగన్.. అక్కడి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పును అవమానించేలా జగన్ మాట్లాడారనే విమర్శలు..
భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానంటూ షెల్జా చేసిన ప్రకటన హుడా వర్గానికి కోపం తెప్పించింది. హుడా మాత్రం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని..
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.