Makeup: కవ్వించే కళ్ల కోసం...!
ABN , First Publish Date - 2023-06-24T12:03:11+05:30 IST
ఐ మేకప్‌లో ప్రాథమిక సూత్రాలు అందరికీ తెలిసే ఉంటాయి. ఏళ్ల తరబడి అలవాటున్నప్పటికీ ఐ మేకప్‌కు సంబంధించిన కొన్ని కిటుకులు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వాటి మీద ఓ లుక్కేద్దాం!
ఐ మేకప్‌లో ప్రాథమిక సూత్రాలు అందరికీ తెలిసే ఉంటాయి. ఏళ్ల తరబడి అలవాటున్నప్పటికీ ఐ మేకప్‌కు సంబంధించిన కొన్ని కిటుకులు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వాటి మీద ఓ లుక్కేద్దాం!
దట్టమైన కనురెప్పల కోసం: మస్కారాతో కనురెప్పలు చక్కని రూపును సంతరించుకుంటాయి. కానీ వాటిని మందంగా కనిపించేలా చేయాలంటే ఒక చిట్కాను అనుసరించక తప్పదు. ఇందుకోసం కనురెప్పలకు ఒక కోటింగ్ వేసిన తర్వాత, లూజ్ పౌడర్‌తో కనురెప్పలకు కోటింగ్ వేయాలి. తర్వాత రెండో కోట్ మస్కారా వేస్తే ల్యాషెస్ ఒత్తుగా కనిపిస్తాయి.
త్రికోణాకారంలో కన్‌సీలర్: కళ్ల దిగువన కన్‌సీలర్‌ను చుక్కల్లా అప్లై చేయకుండా, తలకిందులు త్రికోణాకారంలో కన్‌సీలర్ అప్లై చేయాలి. తర్వాత కళ్ల వైపు రబ్ చేయాలి. ఇలా చేస్తే కళ్ల కింది నలుపు చటుక్కున మాయమవుతుంది.
ఐలైనర్ ఇలా: అందరి కళ్లూ ఒకేలా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కళ్లకు నప్పేలా ఐలైనర్‌ను గీసుకోవాలి. హుడెడ్, డౌన్ టర్న్‌డ్, మోనో లిడ్, రౌండ్.. ఈ నాలుగు రకాల్లో మీ కళ్లు ఏ కోవకు చెందుతాయో కనిపెట్టి వాటికి ఐలైనర్ అప్లై చేసే అత్యుత్తమ పద్ధతిని నేర్చుకోవాలి. ముక్కు దగ్గర కనురెప్పల నుంచి మొదలు పెట్టి, చివరి వరకూ ఐలైనర్ గీసుకోవాలి.
ఫాల్స్ ఐల్యాషెస్: ఫాల్స్ ఐల్యాషె్‌సకు గ్లూ అంటించిన వెంటనే కనురెప్పల మీద అంటించేసుకోకూడదు. ల్యాషె్‌సకు అప్లై చేసిన జిగురు ఆరిపోయేవరకూ 30 సెకన్ల పాటు వేచి ఉండాలి. ఇలా చేస్తే, ఫాల్స్ ఐల్యాషెస్ కనురెప్పల పై నుంచి జారిపోకుండా ఉంటాయి. వీటిని వైనంగా అంటించుకోవడం కోసం, అంటించుకునే సమయంలో కనురెప్పలను దింపి, కిందకు చూస్తూ ఉండాలి.
మస్కారా ఇలా: మీకిష్టమైన మస్కారా చిక్కబడడం మొదలుపెడితే, దాన్లో కొన్ని చుక్కల సెలైన్ నీళ్లను కలపాలి. తర్వాత బ్రష్‌తో కదిలిస్తే, మస్కారా పలుచనవుతుంది. ఇలా చేయడం వల్ల మస్కారా షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది.
ఐషాడోనే ఐలైనర్: ఐలైనర్ లేకపోతే కంగారు పడవలసిన అవసరం లేదు. యాంగిల్ బ్రష్‌ను నీళ్లలో తడిపి, ఐషాడోలో ముంచాలి. తర్వాత ఐలైనర్‌ను ఉపయోగించినట్టే కనురెప్పల మీద అప్లై చేసుకోవాలి.
డార్క్ లైనర్: ఐలైనర్ వేసుకునేటప్పుడు, నలుపు రంగు ఐలైనర్‌తో కనురెప్ప మీద ఆ చివరి నుంచీ ఈ చివరి వరకూ లైన్ గీసుకుంటాం. కానీ ఇలా చేయడం వల్ల కళ్లు చిన్నవిగా కనిపిస్తాయి. బదులుగా కనురెప్ప చివరి నుంచి సగం వరకే నలుపు రంగు ఐలైనర్ వాడి, మిగతా సగం లేత రంగు ఐలైనర్ అప్లై చేయాలి. స్మోకీ ఐస్ కావాలనుకున్నప్పుడు మాత్రం మొత్తం నలుపు రంగే వాడుకోవాలి.