Weight loss: బరువు తగ్గడానికి ఇదొక సులువైన మార్గం!
ABN , First Publish Date - 2023-06-21T11:41:42+05:30 IST
మొలకెత్తిన విత్తనాల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ వీటిని తింటే
మొలకెత్తిన విత్తనాల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ వీటిని తింటే మంచిది. వంద గ్రాముల మొలకెత్తిన గింజలు తింటే.. వంద కేలరీలు వస్తాయి. పైగా తిన్న ఈ ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.
మొలకెత్తిన గింజల్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
డయాబెటిస్ ఉండే వాళ్లు వీటిని తినొచ్చు.
కడుపులో ఎలాంటి సమస్య రాదు. మన దినచర్యలో భాగం చేసుకుంటే కొవ్వుపదార్థం పెరగదు.
శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను పోగొట్టే గుణం వీటికి ఉంది. దీని వల్ల కడుపు శుభ్రం అవుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరవు.
వీటిలో ఉండే సి విటమిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
గర్భిణులు తినాల్సిన ముఖ్యమైన ఆహారం ఇది. బిడ్డకు శక్తి ఇవ్వటంతో పాటు గర్భిణి ఆరోగ్యానికెంతో మంచిది.
విటమిన్- బి ఉండటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. యంగ్‌లుక్ ఉంటుంది.