Eye Care: ఈ జాగ్రత్తలు తీసుకుంటే కళ్లకలక నుంచి బయటపడొచ్చు!

ABN , First Publish Date - 2023-08-15T12:40:01+05:30 IST

ప్రస్తుతం కళ్ల కలక విజృంభిస్తోంది. అందుకే చాలామంది కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. సరైన మందులు వేసుకోవడంతోపాటు కళ్లు శుభ్రంగా ఉంచుకుంటే ఈ వ్యాధి త్వరగా తగ్గుతుంది. వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండాలంటే కళ్ల కలక వచ్చిన వారి కళ్లలోకి నేరుగా చూడకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

Eye Care: ఈ జాగ్రత్తలు తీసుకుంటే కళ్లకలక నుంచి బయటపడొచ్చు!

ఆకు కూరలు, చేపలతో కంటి సమస్యలు దూరం

ప్రస్తుతం కళ్ల కలక విజృంభిస్తోంది. అందుకే చాలామంది కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. సరైన మందులు వేసుకోవడంతోపాటు కళ్లు శుభ్రంగా ఉంచుకుంటే ఈ వ్యాధి త్వరగా తగ్గుతుంది. వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండాలంటే కళ్ల కలక వచ్చిన వారి కళ్లలోకి నేరుగా చూడకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ల వల్ల కంటికి కూడా పని ఎక్కువైపోయింది. వాటికి తోడు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ పై పని కూడా గతంతో పోలిస్తే పెరిగింది. చాలా రంగాల్లో పనులు అన్నీ డిజిటలైజ్‌ అవుతున్నాయి. దీంతో కళ్లకు తగినంత విశ్రాంతి ఉండడం లేదు. కంటి సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, క్రమం తప్పిన జీవనశైలి, ఫోన్ల అధిక వినియోగం ఇవే కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కంటి చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, కంట్లో మంట, కళ్ల నుంచి నీరు కారడం తదితర సమస్యలతో బాధపడాల్సి వస్తోంది.

సాధారణంగా వయస్సు పెరుగుతున్న క్రమంలో కంటి చూపు మసకబారడం సహజం. కానీ చిన్న వయస్సులోనే ఈ సమస్య కనిపిస్తే అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయం నిద్రలేస్తూనే స్మార్ట్‌ఫోన్లు పట్టుకుంటున్నారు. రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే చిన్న మార్పులు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

fies.jpg

విటమిన్‌ ఏ, సీ తీసుకోవాలి..

కళ్లు ఆరోగ్యకరంగా ఉండాలంటే అవసరమైన ముఖ్య పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇందుకోసం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకు కూరగాయలు, చేపలు తీసుకోవచ్చు. విటమిన్‌ ఏ, సీ అధికంగా ఉండే వాటిని (చేపలు) తీసుకోవాలి. వీటిల్లో ఒమెగా 3 ప్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. మాక్యులా ఆరోగ్యానికి ఒమెగా 3 అవసరం.

slepp.jpg

తగినంత నిద్ర..

తగినంత నిద్ర పోతే కంటి చూపులో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది. రాత్రివేళ తగినంత నిద్రపోయే వారికి రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. కళ్లల్లో వాపు, కంటి చుట్టూ నల్లటి వలయాలు కూడా రావు.

కంటిని తాకొద్దు..

కొందరు తరచూ కళ్లను టచ్‌చేస్తూ, నలుపుతూ ఉంటారు. దీనివల్ల ఎన్నో రకాల బ్యాక్టీరీయా చేతుల ద్వారా కళ్లలోకి చేరుతుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కంజక్టివైటీస్‌ సమస్యల రిస్క్‌ పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు కళ్లను తాకొద్దు.

spele.jpg

సన్‌గ్లాసెస్‌..

కంటికి అందం, ఫ్యాషన్‌ కోసం సన్‌గ్లాసెస్‌ అనుకోవద్దు. కంటి చూపు సమస్యలు లేనివారు సైతం దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు విడుదల చేసే అతినీలలోహిత కాంతి కిరణాల ప్రభావం మన కళ్లపై పడకుండా కళ్లద్దాలు కాపాడతాయి. ఎక్కువ అల్ర్టావైరస్‌ కిరణాలకు లోనైతే కంట్లో క్యాటరాక్ట్‌ పెరిగిపోతుంది.

(హైదరాబాద్, నార్సింగ్‌ - ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-08-15T12:52:32+05:30 IST