Fitness Tips: వయసును తగ్గించే వ్యాయామం
ABN , First Publish Date - 2023-01-31T11:30:19+05:30 IST
రోజులు ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే వయసు మీద పడి, వృద్ధాప్యం చేరువైపోతుంది.
రోజులు ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే వయసు మీద పడి, వృద్ధాప్యం చేరువైపోతుంది. కాబట్టి ఆలోగానే శారీరానికి ఫిట్‌నెస్ (Fitness)అలవాటు చేయాలి. అందుకోసం....
కార్డియో వేగంగా లాభాలనందించే డే ట్రైనింగ్ లాంటిది. కాబట్టి కార్డియోతో నేటి నుంచే క్యాలరీలను ఖర్చు చేయడం మొదలుపెట్టండి.
వెయిట్ లిఫ్టింగ్ (Weight lifting) అనేది దీర్ఘకాలపు రాబడి కోసం మనం పెట్టుబడే పెట్టుబడి లాంటిది. కాబట్టి మెటబాలిజంను పెంచి, విశ్రాంతి దశలో సైతం క్యాలరీల ఖర్చుకు తోడ్పడే వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయాలి.
పిండిపదార్థాలతో మనం బరువు పెరగడం. అదనపు క్యాలరీలతో బరువు పెరుగుతాం. కార్బ్స్‌తో శక్తి సమకూరి, కండరాలు బలపడతాయి. కాబట్టి ఆహారంలో సరిపడా కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి.
వెయిట్ లిఫ్టింగ్‌తో సహజసిద్ధంగా మానసిక కుంగుబాటు తగ్గుతుంది.
విపరీతంగా వ్యాయామాలు (Exercises) చేస్తే ఒళ్లు నొప్పులు తప్పవు. ఈ నొప్పులు ఫిట్‌నెస్‌కు సూచనలు కావు.
ఆకలిని బ్లాక్ కాఫీ (Black coffee)తో చంపవచ్చు.
నీళ్ల (Water) తో మరింత మెరుగ్గా ఆకలిని చంపవచ్చు.
ఆహారం పరిమాణం మనం కనిపించే తీరును ప్రభావితం చేస్తే, ఆహారం నాణ్యత మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది.
పీనట్ బటర్‌లో మాంసకృత్తులు మేలైనవి కావు. దాన్లో ప్రొటీన్ (Protein) కంటే ఎక్కువగా పిండి పదార్థాలు, కొవ్వులు ఉంటాయి.
శీతల పానీయాలు (Soft drinks), వంటనూనెలతో ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని పరిమితం చేయాలి.
నిద్రలేమి ఆకలిని, స్ట్రెస్ హార్మోన్లను పెంచుతుంది. దాంతో కొవ్వును కరిగించడం కష్టమవుతుంది.