Teeth: సమస్య చిన్నదే అని వదిలేస్తే..

ABN , First Publish Date - 2023-07-06T12:51:55+05:30 IST

చాలామంది నోటి శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది క్రమంగా అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఓరల్‌ హైజీన్‌ అనేది చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.

Teeth: సమస్య చిన్నదే అని వదిలేస్తే..

చాలామంది నోటి శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది క్రమంగా అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఓరల్‌ హైజీన్‌ అనేది చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.

  • దంతాలు పరిశుభ్రంగా ఉండాలంటే బ్రష్‌ శుభ్రంగా చేయాలి. పేస్ట్‌ వల్ల 10 శాతం, బ్రష్‌ వాడటం సరిగా రాక 90 శాతం దంతాల సమస్యలు తలెత్తుతాయి. దంతాలపై పాచి పెరగకుండా ఉప్పు ఉండే పేస్ట్‌లతో పాటు ఆయుర్వేదిక్‌ పేస్ట్‌లను ఉపయోగించాలి.

  • సాధారణంగా నోటిలోని సమస్య ఏముందిలే అనుకుంటారు.. అయితే ఆ బ్యాక్టీరియా మెల్లగా లోపలికి వెళ్లి రక్తంలోకి చేరి హృదయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

  • చిగుర్లు వ్యాధి వల్ల 50 శాతం గుండె సమస్యలు వస్తాయని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఓరల్‌ హైజీన్‌కు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి.

  • తంబాకు, గుట్కాలాంటివి విపరీతంగా నమిలినా నోరు చెడు వాసన వస్తుంది. ముఖ్యంగా దంతాల రంగు మారిపోతుంది. దానివల్ల నోరు దుర్వాసన కలుగుతుంది. ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలెక్కువ.

  • దంతాలు పరిశుభ్రంగా ఉండాలంటే.. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయటం, నోరు పుక్కిలించటం లాంటివి చేయాలి. అన్నింటికంటే ముందు కూల్‌ డ్రింక్స్‌తో పాటు మసాలా పదార్థాలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా తాజా ఆహారం తినటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.

  • చిగుర్లులో సమస్యలు లేదా దంతాలు పుచ్చిపోవటం లాంటి సమస్య వచ్చినపుడు సొంత వైద్యాలు చేయకూడదు. దంత వైద్యుడిని సంప్రదించాలి.

  • నోరు దుర్వాసన వస్తోందంటే.. శరీరంలో వ్యర్థాలు ఉన్నట్లే అని గ్రహించాలి. రోజుకు రెండుసార్లు మౌత్‌ వాష్‌ చేసుకోవటం మర్చిపోకూడదు.

  • యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే ఆహార పదార్థాలని తినాలి. ఇవి కొల్లాజిన్‌ ఉత్పత్తిని పెంచి నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటిలో పుల్లలు గుచ్చటం, గట్టిగా ఉండే పదార్థాలను తినటం, నోటితో డ్రింక్స్‌ మూతలను ఓపెన్‌ చేయటం లాంటివి చేస్తే దంతాలు పాడవుతాయి. అందుకే ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.

  • గర్భధారణ సమయంలో మహిళలు దంత సంరక్షణకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అయితే ఇలా చేయకుండా ఓరల్‌ హైజీన్‌గా ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డకూ ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవు.

Updated Date - 2023-07-06T12:51:55+05:30 IST