Share News

Indian Medicines: మెడిసిన్ తయారీ కంపెనీల ఘనత.. 4 అరుదైన వ్యాధుల చికిత్స ఖర్చు 100 రెట్లు తగ్గించే ఔషధాల సృష్టి

ABN , First Publish Date - 2023-11-25T11:33:20+05:30 IST

అరుదైన 4 రకాల వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నించిన ఔషధ కంపెనీలు(Indian Medicines) ఆ మేరకు ఫలితం సాధించాయి. ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.

Indian Medicines: మెడిసిన్ తయారీ కంపెనీల ఘనత.. 4 అరుదైన వ్యాధుల చికిత్స ఖర్చు 100 రెట్లు తగ్గించే ఔషధాల సృష్టి

ఢిల్లీ: అరుదైన 4 రకాల వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నించిన ఔషధ కంపెనీలు(Indian Medicines) ఆ మేరకు ఫలితం సాధించాయి. ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సంస్థల సాయంతో భారత్ కి చెందిన ఔషధ కంపెనీలు కేవలం ఒక సంవత్సరంలో.. నాలుగు అరుదైన వ్యాధులకు మందుల్ని అభివృద్ధి చేశారు.

వాటికి అయ్యే చికిత్స ఖర్చును వంద రెట్లు సాధించి గణనీయమైన పురోగతి సాధించారు. ఈ వ్యాధుల్లో చాలా వరకు జన్యుపరమైనవని.. రోగుల్లో ఎక్కువ శాతం పిల్లలే ఉంటున్నారని డాక్టర్లు చెప్పారు. టైరోసినిమియా టైప్ 1 వ్యాధి చికిత్సకు సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుంచి రూ.6.5 కోట్లు ఖర్చయ్యేది.

తాజాగా అభివృద్ధి చేసిన ఔషధాలతో చికిత్సకయ్యే ఖర్చు రూ.2.5 లక్షలకు తగ్గింది. వ్యాధికి గురైన చిన్నారికి 10 ఏళ్ల వయస్సులోపు చికిత్స చేయకపోతే వ్యాధి వ్యాపించి మరణిస్తాడు. ఈ వ్యాధికి చికిత్స చేసే మందును నిటిసినోన్ అంటారు. మరో వ్యాధి గౌచర్స్. ఇది కాలేయాన్ని దెబ్బ తీస్తుంది.


దీనికి చికిత్సగా ఎలిగ్లుస్టాల్ క్యాప్సూల్స్‌ని తీసుకొచ్చారు. వ్యాధి నయానికి ప్రస్తుతం సంవత్సరానికి అయ్యే ఖర్చును రూ.1.8 కోట్ల నుంచి రూ.3.6 కోట్లకు తగ్గిస్తుంది. విల్సన్స్ వ్యాధికి ట్రియంటైన్ క్యాప్సూల్స్‌ రూ.2.2 కోట్ల ఖర్చుని రూ.2.2 లక్షలకు తగ్గిస్తుంది. డ్రావెట్ వ్యాధి చికిత్సకు కనాబిడియోల్ ఓరల్ సొల్యూషన్ తో రూ.7 లక్షల నుంచి రూ.34 లక్షలు అయ్యే ఖర్చుని రూ.1 లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు తగ్గించవచ్చు.

భారత్‌లో 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది రోగులు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80% జన్యుపరమైనవి కావడంతో చిన్న వయస్సులోనే లక్షణాలు కనిపిస్తాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. సంవత్సరం క్రితం, బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో(Biophore India Pvt. Ltd) కూడిన కంపెనీలు... జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్(Laurus Labs Ltd), MSN ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ కలిసి 13 రకాల అరుదైన వ్యాధులకు మందులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించాయి.

నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి త్వరలో మందుల్ని తయారు చేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్‌కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు.

Updated Date - 2023-11-25T11:36:18+05:30 IST