Iron character: ఇనప మూకుడులో వంట చేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ABN , First Publish Date - 2023-09-25T11:57:40+05:30 IST

మన శరీరానికి ఐరన్‌ చాలా అవసరం. ఐరన్‌ (Iron) విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ ఐరన్‌

Iron character: ఇనప మూకుడులో వంట చేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

మన శరీరానికి ఐరన్‌ చాలా అవసరం. ఐరన్‌ (Iron) విలువలు సక్రమంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ ఐరన్‌ విలువలను సక్రమంగా ఉంచుకోవటానికి ఒక మార్గం- ఇనుప మూకుడులో వంటలు వండుకోవటం. ఇనుప మూకుడులో వంట వండినప్పుడు- దానిలోని కొంత ఇనుము ఆహారంలోకి చేరుతుంది. అమెరికన్‌ డయాబెటిక్‌ అసోషియేషన్‌ చేసిన అధ్యయనాల్లో ఇనుప మూకుడులలో వంట వండితే- ఆ ప్రభావం ఆహారంపై ఉంటుందని తేలింది. అందువల్ల ఇనుమ మూకుడులో వంట వండటం మంచిదేనని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

  • ఇనుమ మూకుడులో నిమ్మరసం లేదా వెనిగర్‌ ఉపయోగించే వంటలను వండవద్దు. దీని వల్ల ఆహారపదార్థాలకు ఇనుప వాసన వస్తుంది.

  • వంట వండిన తర్వాత ఆహారపదార్థాలను మూకుడులో వదిలేయవద్దు. సాధారణంగా ఇనుప మూకుడు చాలా ఎక్కువ సమయం వేడిగా ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని దానిలో వదిలేస్తే మాడిపోయే అవకాశముంటుంది.

  • ఇనుప మూకుడును ఉప్పు లేదా బేకింగ్‌ సోడా వేసి తోమాలి. బాగా తోమిన తర్వాత- కొద్దిగా నూనె వేసి గుడ్డతో తుడవాలి. దీని వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది.

Updated Date - 2023-09-25T11:57:40+05:30 IST