Psychologists tips: అనుమానంతో ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారా? ఇలా చేయండి!
ABN , First Publish Date - 2023-09-25T12:40:24+05:30 IST
అనుమానం పెనుభూతం అంటారు. అనుమానమే కాదు. ఆందోళన కూడా ఆరోగ్యాన్ని కబళించే పెనుభూతమే! ఎవరికైనా ఆందోళన ఒక జబ్బుగా మారిందంటే- దాని నుంచి భయం, అనుమానం, ప్రతికూల ఆలోచనలు- ఇలా ఒక దాని వెనక మరొకటి కమ్ముకుంటాయి.
అనుమానం పెనుభూతం అంటారు. అనుమానమే కాదు. ఆందోళన కూడా ఆరోగ్యాన్ని కబళించే పెనుభూతమే! ఎవరికైనా ఆందోళన ఒక జబ్బుగా మారిందంటే- దాని నుంచి భయం, అనుమానం, ప్రతికూల ఆలోచనలు- ఇలా ఒక దాని వెనక మరొకటి కమ్ముకుంటాయి.
ఎందుకొస్తుంది?
ఆందోళన ఒక వ్యాధిగా మారటానికి ఒత్తిడే ప్రధాన కారణం. రకరకాల ఆలోచనలకు సామరస్యపూరితమైన పరిష్కారాలు దొరకకపోతే గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెడుతుంది. దీని వల్ల కొందరికి చెమటలు పడతాయి. కొందరికి కడుపులో తిప్పినట్లు అవుతుంది.. శ్వాస వేగంగా కొట్టుకుంటుంది. గుండె లయ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఆందోళన బాగా పెరిగినప్పుడు మానసిక వైద్యులకు చూపించటం ముఖ్యం. దీనితో పాటుగా ఆందోళన తగ్గించుకోవటానికి మానసిక నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
ఫోన్‌ను కాసేపు పక్కన పెట్టి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనించండి. ఒక పదినిమిషాల పాటు దీర్ఘశ్వాసలు తీసుకోండి.
బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ విలువలు పెరుగుతాయి. గుండె కొట్టుకోనే వేగం తగ్గుతుంది.
చేస్తున్న పనిని కాసేపు ఆపేయండి. కొద్ది సేపు తర్వాత మళ్లీ ఆ పనిని ప్రారంభించండి. వేగంగా కాకుండా నెమ్మదిగా ఆ పనిని పూర్తి చేయటానికి ప్రయత్నించండి.
కొందరు ఆందోళన చెందినప్పుడు- కాఫీ, టీలు తాగుతారు. దీని వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
కళ్లు మూసుకొని ప్రతికూల ఆలోచనలను తరిమివేయటానికి ప్రయత్నించండి. వాటి స్థానంలో మంచి విషయాల గురించి ఆలోచించండి.
ప్రతి రోజూ ఎక్సర్‌సైజ్ చేయండి. దీని వల్ల ఆందోళన తగ్గుతుంది.