Sesame seeds: నువ్వుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

ABN , First Publish Date - 2023-06-19T12:57:33+05:30 IST

తీపి వంటకాల్లో మినహా మనం నువ్వులను పెద్దగా ఉపయోగించం. కానీ నువ్వుల్లో ఉండే పోషకాలు, వాటితో పొందే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనన్ని. అవేంటో

Sesame seeds: నువ్వుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
Sesame seeds

తీపి వంటకాల్లో మినహా మనం నువ్వులను పెద్దగా ఉపయోగించం. కానీ నువ్వుల్లో ఉండే పోషకాలు, వాటితో పొందే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనన్ని. అవేంటో తెలుసుకుందాం!

  • నువ్వుల్లో లిగ్నాన్స్‌ అనే కరిగే పీచు ఉంటుంది. ఇది హైడ్రేషన్‌ను పెంచి, మలం పరిమాణాన్ని పెంచి, పేగుల్లో సులువుగా ప్రయాణించేలా చేసి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అలాగే పేగుల్లో చక్కెర శోషణను తగ్గించి, జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

  • నువ్వుల్లోని సిసామిన్‌ అనే లిగ్నాన్‌ శరీరంలోని కొవ్వుల మెటబాలిజంను పెంచుతుంది. కొవ్వును కరిగించేలా కాలేయానికి తోడ్పడడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృద్రోగ జబ్బుల ముప్పు తగ్గుతుంది.

  • నువ్వుల్లో పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు, సిసామిన్‌, విటమిన్‌ ఇలు ఎక్కువ. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా, యాంటీ ఆక్సిడెంట్లుగా ఉపయోగపడి, రక్తనాళాలు విప్పారేలా చేసి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

దుష్ప్రభావాలూ ఉన్నాయి

అవసరానికి మించి నువ్వులను తీసుకోవడం వల్ల, పొట్టలో లేదా పెగ్గ పేగుల్లో చీకాకు, నొప్పి తలెత్తవచ్చు. ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే అందుకు నువ్వుల్లోని అధిక క్యారరీలు కారణం కాదు. (వంద గ్రాముల నువ్వుల్లో 573 కిలో క్యాలరీలుంటాయి). ఎక్కువ నువ్వులు తినడం వల్ల వాటిలోని ఎక్కువ పరిమాణాల్లోని ఫ్యాటీ యాసిడ్ల వల్ల బరువు పెరుగుతాం.

ఎన్ని తినాలి?

రోజుకు ఒకటి నుంచి రెండు టూబుల్‌ స్పూన్ల నువ్వులను తినవచ్చు. అయితే ఒకేసారి తినకుండా రోజు మొత్తంలో ఈ పరిమాణం నువ్వులను తింటూ ఉండాలి. నువ్వులను అలాగే నేరుగా తినవచ్చు. సలాడ్‌తో కలిపి తినవచ్చు. బ్రెడ్‌, కుకీస్‌, కేక్స్‌ తయారీలో వాడుకోవచ్చు.

Updated Date - 2023-06-19T12:57:33+05:30 IST