Israel-Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో కీలకమైన ముగ్గురు హమాస్ ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2023-10-27T11:01:29+05:30 IST
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో(Airstrike) ముగ్గురు కీలకమైన ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దారాజ్ తుఫా బెటాలియన్ కు చెందిన ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులే(Terrorists) లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వారు నివసిస్తున్న స్థావరాలపై ఫైటర్ జెట్లతో దాడి చేశామని మిలిటరీ శుక్రవారం తెలిపింది.
జెరూసలెం: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో(Airstrike) ముగ్గురు కీలకమైన ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దారాజ్ తుఫా బెటాలియన్ కు చెందిన ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులే(Terrorists) లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వారు నివసిస్తున్న స్థావరాలపై ఫైటర్ జెట్లతో దాడి చేశామని మిలిటరీ శుక్రవారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి చేసి.. వందల మంది మృతికి కారణమైన వారిలో వీరు కీలకపాత్ర పోషించారని వెల్లడించింది. హమాస్ ఉగ్రవాద సంస్థకి చెందిన అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్ కార్యకర్తలుగా వీరిని పరిగణిస్తారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defence Forces) ఎక్స్ హ్యాండిల్ లో "దరాజ్ తుఫా బెటాలియన్‌లోని ముగ్గురు సీనియర్ హమాస్ కార్యకర్తలను IDF ఫైటర్ జెట్‌లు ఢీ కొట్టాయి. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన వారిలో వీరు కీలక పాత్ర పోషించారు"అని రాసుకొచ్చింది. దారాజ్ తఫా గాజా సిటీ బ్రిగేడ్ లోని ఓ బెటాలియన్. ఇది హమాస్ కి చెందిన అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్ గా ఉంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిట్ బెన్ ఇచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం, హమాస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బరుద్ వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. అతను అక్టోబర్ 7న జరిగిన దాడిలో మరో సూత్రధారి. యుద్ధంపై ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్పందింస్తూ.. ఇజ్రాయెల్ దళాలు ఇకపై పూర్తి స్థాయిలో దండయాత్రకు సిద్ధమవుతున్నాయన్నారు.
ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్ - హమాస్(Israel-Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా(Gaza)లోని అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్న ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లింది. తాజాగా ఆ దేశ సైన్యం ఉత్తర గాజాలోకి ప్రవేశించి దాడులు చేస్తోంది. అదే టైంలో సేనలు ఇరాక్(Irak)లోని యూఎస్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంపై డ్రోన్ దాడి(Drone Attack) చేసినట్లు సమాచారం. ఇరాన్(Iran) మద్దతు ఉన్న మిలీషియా ఉత్తర ఇరాక్ లోని యూఎస్(US) సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు గాజాలో మరణాల సంఖ్య 7 వేలు దాటింది. 2014లో ఆరువారాల పాటు జరిగిన గాజా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. వెస్ట్ బ్యాంక్ లో 100 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు.