Share News

Israel–Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లో 266 మంది మృతి

ABN , First Publish Date - 2023-10-23T08:10:36+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో(Air Strikes) గాజాలోని 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. గడిచిన 24 గంటల్లో 266 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అధికారులు చెప్పారు.

Israel–Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లో 266 మంది మృతి

గాజా: ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో(Air Strikes) గాజాలోని 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. గడిచిన 24 గంటల్లో 266 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు సోమవారం కూడా గాజాపై బాంబు దాడి కొనసాగిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దక్షిణ లెబనాన్‌పై(Lebanon) ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇంతలో, యూఎస్, యూకె, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలు అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని పిలుపునిస్తూ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.


అదే సమయంలో ఉగ్రవాదానికి(Terrorism) వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడి చేయడంతో 14 వందల మంది ఇజ్రాయెలియన్లను బలయ్యారు. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై(Gaza) వైమానిక దాడికి దిగింది. ఈ ఘటనలో గాజాలో 4 వేల 600 మంది మరణించారని అధికారులు తెలిపారు. తాజాగా గాజాలోని నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కనీసం 30 మంది పాలస్తీనియన్లు మరణించారు.


ఈ భవనం జబాలియా శరణార్థి శిబిరంలోని అల్-షుహదా ప్రాంతంలో ఉంది. భవనం నేలమట్టమైందని, ఇరుగుపొరుగు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 117 మంది చిన్నారులు సహా 266 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్‌లోని మూడు ఆసుపత్రుల సమీపంలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసిందని పాలస్తీనా మీడియా నివేదించింది. గాజా సిటీలోని షిఫా, అల్-ఖుద్స్ ఆసుపత్రుల దగ్గర, ఎన్‌క్లేవ్‌కు ఉత్తరాన ఉన్న ఇండోనేషియా హాస్పిటల్ సమీపంలో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇలా.. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా ప్రాంతంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-10-23T08:10:36+05:30 IST