Earthquake:నేపాల్‌లో భూకంపం.. భారీగా ప్రాణ నష్టం?
ABN , First Publish Date - 2023-10-22T11:03:33+05:30 IST
నేపాల్(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది.
ఖాట్మండు: నేపాల్(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(National center for seismology) వెల్లడించింది. అయితే ప్రమాదధాటికి ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా.. అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల తొలి వారంలో సైతం నేపాల్ ని భూకంపాలు వణికించాయి. అప్పుడు అరగంట టైంలో భూమి 5 సార్లు కంపించి పెను విషాదం నింపింది.
ఆ ధాటికి చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాల శిథిలాలు తొలగిస్తుంటే శవాలు కుప్పలుగా బయటపడ్డాయి. ఆ ప్రమాదంలో మొత్తం మృతులు 3 వేల 600లు కాగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన మరవక ముందే మళ్లీ భూకంపం నమోదుకావడం ఆ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ (PDNA) నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది.