Morocco Earthquake : మొరాకోలో భూకంపం.. 632 మంది మృతి!..

ABN , First Publish Date - 2023-09-09T13:47:55+05:30 IST

మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్ నుంచి మరకేష్ వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Morocco Earthquake : మొరాకోలో భూకంపం.. 632 మంది మృతి!..

న్యూఢిల్లీ : మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్ నుంచి మరకేష్ వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఉత్తర ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం టౌబ్కల్ సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉంది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మొరాకో మీడియా ఈ వివరాలను వెల్లడించింది.

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లెయెన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఈ కష్టకాలంలో మొరాకో ప్రజలకు సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధితులకు హుటాహుటిన సహాయపడిన అధికారులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు.

మొరాకో ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపిన సమాచారం ప్రకారం, మరకేష్‌లోని ఆసుపత్రులకు భూకంప బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వీరందరికీ చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భూకంపం వల్ల నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు సంభవించడం చాలా అరుదు. పర్వత ప్రాంతాల్లో ఇంత భారీ భూకంపం రావడం అసాధారణ విషయమని భూకంప పర్యవేక్షక, హెచ్చరికల శాఖ తెలిపింది.

అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం శుక్రవారం రాత్రి 11.11 గంటలకు సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.8గా నమోదైంది. ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి :

Chandrababu Arrest : ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్టో తెలియదు.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం: నారా లోకేష్

Chandra Babu Arrest : చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

Updated Date - 2023-09-09T13:51:22+05:30 IST