Afghanistan: అఫ్గనిస్తాన్‌లో భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

ABN , First Publish Date - 2023-10-07T14:17:52+05:30 IST

అఫ్గనిస్తాన్ లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపాలు(Earthquake) సంభవించాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో 6.1, 5.9 తీవ్రతతో ఇవి తీవ్రతను నమోదు చేశాయి. 12:11కి 6.1 తీవ్రతతో, 12:19కి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(Seismology) తెలిపింది. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కార్యకలాపాల కేంద్రాన్ని గుర్తించారు.

Afghanistan: అఫ్గనిస్తాన్‌లో భూకంపం..  భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

కాబూల్: అఫ్గనిస్తాన్ లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపాలు(Earthquake) సంభవించాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో 6.1, 5.9 తీవ్రతతో ఇవి తీవ్రతను నమోదు చేశాయి. 12:11కి 6.1 తీవ్రతతో, 12:19కి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(Seismology) తెలిపింది. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కార్యకలాపాల కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ప్రమాదాల్లో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


మంగళవారం, 6.2 తీవ్రతతో సంభవించిన నాలుగు భూకంపాలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. ఉత్తరాఖండ్‌లోని తీర్థయాత్ర పట్టణమైన జోషిమత్‌కు ఆగ్నేయంగా 206 కిలోమీటర్ల దూరంలో, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్ నవూకు ఉత్తరాన 284 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నేపాల్‌లోని దిపాయల్ జిల్లాలో భూకంపం కేంద్రం ఉంది.

Updated Date - 2023-10-07T14:21:23+05:30 IST