Share News

Israel - Hamas: గాజా నుంచి వలస.. ఈజిప్టుకు క్యూ కడుతున్న విదేశీయులు

ABN , First Publish Date - 2023-11-01T19:27:36+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.

Israel - Hamas: గాజా నుంచి వలస.. ఈజిప్టుకు క్యూ కడుతున్న విదేశీయులు

కైరో:ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు. గాజా(Gaza)పై జరుగుతున్న దాడులతో భీతిల్లిన విదేశీయులు ఇప్పుడు పక్కనే ఉన్న ఈజిప్టు(Egypt) బాట పట్టారు. బుధవారం రాఫా క్రాసింగ్(Rafa Crossing) మీదుగా ఈజిప్టులోకి ప్రవేశించారు. వీరి సంఖ్య వందల్లో ఉందని అధికారులు తెలిపారు. రాఫా క్రాసింగ్ గాజాకు దక్షిణం వైపున ఉంది. 44 దేశాలకు చెందిన పాస్ పోర్ట్ హోల్డర్లు, 28 విదేశీ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది ఈజిప్టులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తాజాగా బయటకి వచ్చింది. వీడియోలో 400 మంది విదేశీయులు, వారి వాహనాలు, అంబులెన్స్ లు ఈజిప్టులోకి ప్రవేశిస్తుండటం కనిపిస్తోంది.


అక్టోబర్ 7న ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత ఫస్ట్ టైం చాలా మంది పాస్ట్ పోర్ట్ హోల్డర్లు గాజాను విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన 81 మంది పాలస్థీనియన్లకు(Palestina) చికిత్స అందించడానికి ఈజిప్టులోకి అనుమతించినట్లు ఆ దేశం ఓ ప్రకటనలో తెలిపింది. గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడాన్ని ఖండించింది. ఈ దాడిలో 50 మందికి పైగా మృతి చెందారు. రక్షణలేని పౌరులను టార్గెట్ గా చేసుకుని విచక్షణారహితంగా దాడులకు దిగడాన్ని ఆ దేశం ఖండించింది. ఇజ్రాయెల్ - హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 8 వేలకుపైగా మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా చిగురుటాకుల వణుకుతోంది. వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నా.. దాడుల్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ(Benjamin Nethanyahu) స్పష్టం చేశారు. ఈ దాడుల్ని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ కి సపోర్ట్ నిస్తోంది. గాజా నుంచి వలస వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భీకర పోరులో గాయపడ్డ వారికి మానవతా సాయం అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.

Updated Date - 2023-11-01T19:28:25+05:30 IST