Share News

Issam Abu Rukbeh: ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం.. హమాస్ వైమానిక ద‌ళాధిప‌తి హ‌తం

ABN , First Publish Date - 2023-10-28T14:15:18+05:30 IST

గాజాపై ఇజ్రాయెల్(Israeil) వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన వైమానిక దళాధిపతి అస్సామ్ అబూ రుక్బే(Issam Abu Rukbeh) హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతన్ని అంతమొందించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.

Issam Abu Rukbeh: ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం.. హమాస్ వైమానిక ద‌ళాధిప‌తి హ‌తం

టెల్‌ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్(Israeil) వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన వైమానిక దళాధిపతి అస్సామ్ అబూ రుక్బే(Issam Abu Rukbeh) హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతన్ని అంతమొందించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. హమాస్ ఉగ్ర గ్రూపునకు చెందిన డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్ సిస్టమ్స్ కు అబూ మెసేజ్ చేసేవాడని మిలిటరీ తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల్లో సైతం ఇతను కీలక పాత్ర పోషించారని చెప్పారు. అబూ ఆదేశాల మేరకే హామాస్ పారాగ్లైడర్లు.. ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోకి చొచ్చుకొచ్చి దాడికి పాల్పడినట్లు ఐడీఎఫ్(IDF) వెల్లడించింది.


రెండు వారాల కిందట హమాస్ ఏరియల్ ఫోర్సెస్ కు చెందిన మాజీ చీఫ్ మురాద్ అబూ ముదాద్ హతమైనట్లు గతంలోనే ఐడీఎఫ్ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రాత్రిపూట నిర్వహిస్తున్న గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో , సైనికులు, హమాస్(Hamas) ఉగ్రవాదుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. అయితే, ఈ ఘర్షణల్లో సైనికులు ఎవరూ గాయపడలేదని సమాచారం. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. IDF హమాస్ తీవ్రవాద గ్రూపునకు చెందిన సుమారు 150 అండర్ గ్రౌండ్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. దీని ఫలితంగా అనేక మంది హమాస్ మిలిటెంట్లు మరణించారని ఇజ్రాయెల్ నివేదించింది. శుక్రవారం రాత్రి, యెమెన్‌లోని ఇరాన్ ప్రాక్సీ ఉగ్రవాద సంస్థ హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలో ఈజిప్ట్‌లోని టబాను తాకింది. ఈ ఎటాక్‌లో ఆరుగురు ఈజిప్టు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే యుద్ధం తక్షణం ఆపాలని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెస్తున్నాయి.

Updated Date - 2023-10-28T14:17:42+05:30 IST