Share News

Israel-Hamas Truce: ఇజ్రాయెల్, హమాస్ తాత్కాలిక సంధి మరో రెండ్రోజులు పొడిగింపు

ABN , First Publish Date - 2023-11-28T18:32:55+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్‌మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.

Israel-Hamas Truce: ఇజ్రాయెల్, హమాస్ తాత్కాలిక సంధి మరో రెండ్రోజులు పొడిగింపు

గాజా: ఇజ్రాయెల్-హమాస్‌ (Israel-Hamas)మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి (Temporary Truce) గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాగంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది. తొలుత నాలుగు రోజులు అనుకున్న తాత్కాలిక సంధి కాలం మరో రెండు రోజులు పొడిగించిన విషయాన్ని ఖతార్, యూఎస్ ధ్రువీకరించారు. 10 మంది బందీలకు ఒక రోజు చొప్పున గడువు పొడిగించేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉంది.


కాగా, అమెరికా దౌత్యంతో ఇజ్రాయెల్-హమాస్ వర్గాల మధ్య కుదిరిన నాలుగురోజుల తాత్కాలిక సంధి గడువు ముందు అనుకున్న ప్రకారం మంగళవారంతో ముగియాల్సి ఉంది. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నాలుగురోజుల పాటు గాజాలో మిలటరీ ఆపరేషన్లను ఇజ్రాయెల్ ఆపేస్తుంది. బందీలను రెండు వైపుల నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇంతవరకూ 50 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులును హమాస్ విడిచిపెట్టగా, 117 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తాజాగా రెండు వర్గాల మధ్య కుదిరిన సంధి గడువును మరో రెండు రోజులు పొడిగించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. పాలస్తీనా ప్రజలకు మానవతాసాయం అందిస్తున్న అతిపెద్ద డోనర్ తామని, పాలస్తీనాలో శాంతికి భవిష్యత్తులోనూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.

Updated Date - 2023-11-28T18:32:56+05:30 IST