Share News

Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడిలో మరో హమాస్ కమాండర్ హతం

ABN , First Publish Date - 2023-10-15T19:41:18+05:30 IST

ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో మరో హమాస్ సీనియర్ కమాండర్ హతమయ్యాడు. హమాస్ నుఖ్బా యూనిట్‌కు చెందిన సదరన్ ఖాన్ యూనిస్ బెటాలియన్ కమాండర్ బిల్లాల్ అల్-కేద్ర తాము జరిపిన వైమానిక దాడుల్లో హతమైనట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆదివారంనాడు తెలిపింది.

Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడిలో మరో హమాస్ కమాండర్ హతం

టెల్ అవివ్: ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో (Israel airstrikes) మరో హమాస్ సీనియర్ కమాండర్ (Hamas Senior commander) హతమయ్యాడు. హమాస్ నుఖ్బా యూనిట్‌కు చెందిన సదరన్ ఖాన్ యూనిస్ బెటాలియన్ కమాండర్ బిల్లాల్ అల్-కేద్ర (Billal al-Qedra) తాము జరిపిన వైమానిక దాడుల్లో హతమైనట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఆదివారంనాడు తెలిపింది. షిన్ బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ అండ్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సమాచారంతో గాజా స్ట్రిప్‌పై రాత్రికి రాత్రి ఈ దాడులు జరిపినట్టు పేర్కొంది. పలువురు ఉగ్రవాదులు సైతం ఈ దాడుల్లో మరణించినట్టు ప్రకటించింది.


కాగా, శనివారం రాత్రి 100కు పైగా హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. హమాస్ కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పలు ట్యాంకులతో పాటు హమాస్ క్షిపణి దాడుల ల్యాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. కాగా, శనివారం ఉదయం హమాస్‌కు చెందిన మరో కీలక కమాండర్‌ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. గత వారంలో సదరన్ ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులకు ఇతను సారథ్యం వహించినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. హమాస్ టెర్రరిస్టులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించింది.


తాజా సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో సుమారు 1,300 మంది మృతి చెందగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ ఉగ్ర సంస్థ 120 మంది పౌరులను బందీలుగా పట్టుకున్నట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది.

Updated Date - 2023-10-15T19:41:18+05:30 IST