Share News

Hamas Video: హమాస్ చేతుల్లో బంధీలుగా చిన్నారులు.. వీడియో రిలీజ్ చేసిన ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2023-10-14T15:23:27+05:30 IST

ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కి చెందిన చిన్నారులను బంధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సాయుధులు టెలిగ్రామ్(Telegram) యాప్ లో రిలీజ్ చేశారు. అయితే తాము పిల్లల్ని బాగా చూసుకుంటున్నామనే మెసేజ్ ఇచ్చేలా ఈ వీడియో ఉంది.

Hamas Video: హమాస్ చేతుల్లో బంధీలుగా చిన్నారులు.. వీడియో రిలీజ్ చేసిన ఉగ్రవాదులు

జెరూసలెం: ఇజ్రాయెల్-పాలస్థీనా(Israeil-Palestine) యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కి చెందిన చిన్నారులను బంధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సాయుధులు టెలిగ్రామ్(Telegram) యాప్ లో రిలీజ్ చేశారు. అయితే తాము పిల్లల్ని బాగా చూసుకుంటున్నామనే మెసేజ్ ఇచ్చేలా ఈ వీడియో ఉంది. అందులో.. ఓ చిన్నారిని ఊయలలో ఆడిస్తున్నారు. మరొకరిని ఎత్తుకుని తిప్పుతున్నారు. హమాస్ టెర్రరిస్టులు(Hamas Terrorists) ఏకే 45 రైఫిళ్లను పట్టుకుని.. చిన్నారులను ఆడిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో వ్యక్తి ఏకే రైఫిల్ తో ఉన్న చిన్నారిని భుజాలపై ఎత్తుకున్నాడు. ఊయలలో ఏడుస్తున్న చిన్నారిని బుజ్జగించడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. మరో పిల్లాడు తాగేందుకు నీరు అడిగితే..ఉగ్రవాది ఆ చిన్నారితో బిస్మిల్లా అని చెప్పమంటూ నీరు తీసుకొచ్చి ఇస్తాడు. ఇలాంటి దృశ్యాలన్ని సోషల్ మీడయాలో వైరల్ అయ్యాయి.


అదే టైంలో ఇజ్రాయెల్ గాజాను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు శాయశక్తులు ఒడ్డుతోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్‌ పాలనలో ఉన్న గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి అనేక భవనాలను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం(Israeil Army) దాడిని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర గాజాలోని దాదాపు 11 లక్షల మంది పాలస్తీనీయులను 24 గంటల్లోగా ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశించింది. హమాస్‌ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయటానికి వీలుగా భూతల యుద్ధానికి దిగటం కోసమే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.


దీనిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. అంతమంది ఒక్కసారిగా తరలివెళ్లటం అసాధ్యమని, మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే నెలకొన్న విషాదాన్ని పెను విపత్తుగా మార్చవద్దని, ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. మరోవైపు, మానసిక యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్‌ ఇటువంటి హెచ్చరికలకు పాల్పడుతున్నదని, ఎవరూ ఉత్తర గాజాను వదిలివెళ్లవద్దని పౌరులకు హమాస్‌ పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకం మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీసంఖ్యలో వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోతున్నవారిపైన కూడా ఇజ్రాయెల్‌ దాడులు చేసిందని, 70 మంది చనిపోయారని హమాస్‌ ఆరోపించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 150 మంది బందీలలో 13 మంది మరణించారని హమాస్ తెలిపింది.

Updated Date - 2023-10-14T15:23:27+05:30 IST