Iran:ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే యుద్ధమే.. హెచ్చరించిన ఇరాన్
ABN , First Publish Date - 2023-10-13T15:35:30+05:30 IST
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel-Palastine) మధ్య బాంబుల వర్షం కురుస్తున్న వేళ ఇరాన్(Iran) ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్(Gaza Strip)పై బాంబు దాడులు ఆపకపోతే ఆ దేశ సరిహద్దుల్లో యుద్ధం మొదలుకావచ్చని హెచ్చరించింది.
టెహ్రాన్: ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel-Palastine) మధ్య బాంబుల వర్షం కురుస్తున్న వేళ ఇరాన్(Iran) ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్(Gaza Strip)పై బాంబు దాడులు ఆపకపోతే ఆ దేశ సరిహద్దుల్లో యుద్ధం మొదలుకావచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్ డొల్లాహియన్ బీరూట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజాపై ఇజ్రాయెల్ మెరుపు దాడికి దిగడం, ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడం.. తద్వారా సంక్షోభం తలెత్తి యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. ఆయన తాజాగా ఆ దేశ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీతో సమావేశమయ్యారు. గాజాలోని హమాస్‌కు, లెబనాన్‌లోని హిజ్బుల్లాకు ఇరాన్ సపోర్ట్‌గా ఉంటోంది. అమెరికా, భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్, గాజా(Gaza)ల పరస్పర రాకెట్ల దాడులతో 2 వేల 500 మందికి పైగా మరణించగా.. 5 వేలకు పైగా గాయపడ్డారు.
అదే టైంలో ఇజ్రాయెల్-పాలస్థీనా మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది. వారి వివరాల ప్రకారం.. గాజా, లెబనాన్‌లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల్లో ప్రమాదకర తెల్ల భాస్వరం(White Phosphorus) వాడుతున్నట్లు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కెమికల్ ఆయుధాలు వాడితే బాధితులు తీవ్ర గాయాలపాలయ్యి, దీర్ఘకాలిక జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం వివరణ కోరగా.. తెల్ల భాస్వరం కలిగిన ఆయుధాలను(Weapons) ఉపయోగించట్లేదని వెల్లడించింది. అయితే ఆ సంస్థ కెమికల్ ఉపయోగించారనడానికి సాక్ష్యాధారాలను చూపుతోంది. వాటి వాడకాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ని కోరుతోంది.