Israel-Hamas:ఆసుపత్రిపై బాంబు దాడి.. పరస్పర ఆరోపణలకు దిగిన ఇజ్రాయెల్ - హమాస్
ABN , First Publish Date - 2023-10-18T10:32:27+05:30 IST
ఇజ్రాయెల్-హమాస్(Hamas) ల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 500 మంది మృతిచెందారు. అయితే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) ల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 500 మంది మృతిచెందారు. అయితే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. పాలస్తీనా ఉగ్రవాద సమూహం హమాస్ మిస్సైల్ మిస్ ఫైర్ అయిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే హమాస్ ఇజ్రాయెల్ ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఉగ్రవాద సంస్థ అంటోంది. ఇజ్రాయెల్-హమాస్(Israel - Hamas) ల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన ఏరియల్ దాడుల్లో 500 మంది మృతిచెందారు. గాజాలోని అల్-అహ్లీ బాప్టిస్ట్ ఆస్పత్రిపై మంగళవారం సాయంత్రం బాంబు దాడులు జరిగినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ వరుస దాడుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయని ఆరోపించింది. అయితే.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) వర్గాలు దీన్ని ఖండించాయి.
ఆస్పత్రిలో దాచిన మందుగుండు వల్ల నష్టం జరిగి ఉంటుందని వ్యాఖ్యానించాయి. మరోవైపు ఇజ్రాయెల్ అల్టిమేటం మేరకు గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లు దక్షిణ ప్రాంతానికి చేరుకోగా.. ఐడీఎఫ్ మంగళవారం ఉదయం నుంచి సెంట్రల్ గాజాపై ఏరియల్ స్ట్రైక్స్‌ను పెంచింది. దాడుల్లో 88 మంది పౌరులు, వైద్యులు, వైద్య సిబ్బంది చనిపోయారని హమాస్ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 2,778 మంది పౌరులు చనిపోయారని, వారిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులేనని వివరించాయి. ఇజ్రాయెల్‌లోనూ మరణాల సంఖ్య 1,400గా ఉందని ఐడీఎఫ్ వర్గాలు తెలిపాయి. గాజాలోని ఆసుపత్రిపై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో అమ్మన్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరగాల్సిన ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇవాళ బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు.