Israel-Palestine:గాజాను విడిచి వెళ్లిపోండి.. స్థానికులను హెచ్చరించిన ఇజ్రాయెల్
ABN , First Publish Date - 2023-10-13T11:53:15+05:30 IST
ఇజ్రాయెల్ - పాలస్థీనా భీకర పోరులో గాజా స్ట్రిప్ రక్తసిక్తంగా మారుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ అక్కడి ప్రజలను తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే అక్కడ నివసిస్తున్న పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరు ప్రాంతాల మధ్య దాడులు 6వ రోజుకు చేరుకున్నాయి. హమాస్ ఉగ్రవాదులు 150 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టేవరకి గాజా స్ట్రిప్ ముట్టడిని వదిలేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
జెరూసలెం: ఇజ్రాయెల్ - పాలస్థీనా భీకర పోరులో గాజా స్ట్రిప్(Gaza Strip) రక్తసిక్తంగా మారుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ అక్కడి ప్రజలను తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే అక్కడ నివసిస్తున్న పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరు ప్రాంతాల మధ్య దాడులు 6వ రోజుకు చేరుకున్నాయి. హమాస్ ఉగ్రవాదులు 150 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టేవరకి గాజా స్ట్రిప్ ముట్టడిని వదిలేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఉత్తర గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది నివసిస్తున్నారు.
వేల సంఖ్యలో బాంబుల వాడకం..
గాజా స్ట్రిప్ పై దాడికి ఇజ్రాయెల్ 7 వేల వరకు బాంబులు వాడినట్లు తెలుస్తోంది. వాటి బరువు సుమారు 5 వేల టన్నుల వరకూ ఉంటుందని.. పెను విధ్వంసమే ధ్యేయంగా వీటిని వాడినట్లు చెబుతున్నారు. గాజాపైనే మొత్తం బాంబులు వేసినట్లు తెలుస్తోంది. సుమారు 3 వేల 800 ప్రాంతాలే టార్గెట్గా అటాక్ చేసినట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది. ఇజ్రాయెల్-పాలస్థీనా(Israel- Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆయుధాల్లో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు మానవ హక్కుల సంస్థ(Human Rights) ఆరోపించింది. వారి వివరాల ప్రకారం.. గాజా, లెబనాన్‌లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల్లో ప్రమాదకర తెల్ల భాస్వరం(White Phosphorus) వాడుతున్నట్లు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ కెమికల్ ఆయుధాలు వాడితే బాధితులు తీవ్ర గాయాలపాలయ్యి, దీర్ఘకాలిక జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం వివరణ కోరగా.. తెల్ల భాస్వరం కలిగిన ఆయుధాలను(Weapons) ఉపయోగించట్లేదని వెల్లడించింది. అయితే ఆ సంస్థ కెమికల్ ఉపయోగించారనడానికి సాక్ష్యాధారాలను చూపుతోంది. వాటి వాడకాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ని కోరుతోంది.