Share News

Israel - Palestine: ఇజ్రాయెల్‌లో మసీదుపై వైమానిక దాడి.. హమాస్‌పై దాడులు ఉద్ధృతం

ABN , First Publish Date - 2023-10-22T10:05:12+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి. తాజాగా హమాస్ మిలిటెంట్ల వైమానిక దాడిలో ఇజ్రాయెల్ వెస్ బ్యాంక్ లోని మసీదు కింద ఉన్న కంపౌండ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది.

Israel - Palestine: ఇజ్రాయెల్‌లో మసీదుపై వైమానిక దాడి.. హమాస్‌పై దాడులు ఉద్ధృతం

జెరూసలెం: ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి. తాజాగా హమాస్ మిలిటెంట్ల వైమానిక దాడిలో ఇజ్రాయెల్ వెస్ బ్యాంక్ లోని మసీదు కింద ఉన్న కంపౌండ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది. హమాస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే గాజాకి మానవతా కోణంలో అమెరికా సాయాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హమాస్ టెర్రరిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. హమాస్ టెర్రరిస్టులు చాలా మంది అమాయకపౌరులను బందీలుగా చేసుకున్నారు. వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉంటున్నారు. అమెరికాకు చెందిన తల్లి జుడిత్ తాయ్ రానన్, కుమార్తె నటాలీ సైతం వారి అదుపులో ఉన్నట్లు అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ కి సమాచారం అందింది. వారిని విడిపించడానికి యూఎస్ చేసిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లి, కుమార్తెలను శుక్రవారం గాజా స్ట్రిప్ సరిహద్దు వద్ద ఇజ్రాయెల్ దళాలకు అప్పగించారు.అనంతరం వారు ఆనందంతో అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కి ఫోన్ చేశారు. బంధువుల కోసమని ఇజ్రాయెల్ వచ్చిన వారిరువురు యుద్ధం ప్రారంభమైన టైంలో హమాస్ టెర్రరిస్టుల చేతికి చిక్కారు. దీంతో అప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.


సాయం చేయాలని అమెరికా ప్రభుత్వానికి వారి బంధువులు విన్నవించడంతో అధికారులు రంగంలోకి దిగి వారిని హమాస్ నుంచి విడిపించారు. జో బైడెన్ తో ఫోన్లో మాట్లాడుతూ.. తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. "హమాస్ చేతుల నుంచి విముక్తులైన ఇద్దరు అమెరికన్లతో నేను ఇప్పుడే మాట్లాడాను. వారికి ప్రభుత్వం పూర్తిగా సాయం అందిస్తుంది. ఇజ్రాయెల్ కు ఈ విషయంలో సంపూర్ణ మద్దతునిస్తాం" అని బైడెన్ పేర్కొన్నారు. ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన హమాస్ మిలిటెంట్లు ఏకంగా 200 మందిని బందించి గాజాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన వారిలో ఇజ్రాయెల్ పౌరులే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. అందులోనే తాజాగా విడుదలైన అమెరికాకు చెందిన తల్లీ కూతుళ్లు కూడా ఉన్నారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. ఇరువైపుల నుంచి వైమానిక దాడులు జరగడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నాశయమయ్యాయి. ఈ యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడిలో 1,400కుపైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో 4 వేలకు పైగా గాజా పౌరులు ప్రాణాలు విడిచారు. మరోవైపు గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో చాలా మంది ప్రాణాలతోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను సైతం గాజా స్ట్రిప్‌కు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లు నిండిన వృద్ధులు ఉన్నారని తెలిపింది.

Updated Date - 2023-10-22T10:05:12+05:30 IST