Israel vs Hamas: ఇదే హమాస్‌కు చివరి యుద్ధం.. ఇజ్రాయెల్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2023-10-09T21:57:31+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడి చేయడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్.. అందుకు ప్రతీకారం తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యింది. మొత్తం హమాస్ గ్రూపునే అణచివేసి..

Israel vs Hamas: ఇదే హమాస్‌కు చివరి యుద్ధం.. ఇజ్రాయెల్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడి చేయడంతో తీవ్ర కోపాద్రిక్తులైన ఇజ్రాయెల్.. అందుకు ప్రతీకారం తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యింది. మొత్తం హమాస్ గ్రూపునే అణచివేసి.. గాజాని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసేసుకుంది. ఇప్పటికే విద్యుత్, ఆహారం, ఇంధనాల సరఫరాలపై నిషేధం విధించి గాజాను దిగ్భంధించింది. అనంతరం లక్ష మంది సైనికుల్ని రంగంలోకి దింపి.. గాజావైపుకు పంపే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే.. ఇజ్రాయెల్‌కి సంబంధించిన రాజకీయ నేతలు, మంత్రులు తమదైన శైలిలో హమాస్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ క్యాబినెట్ సెక్రటరీ యోసీ ఫుక్స్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హమాస్‌కు ఇదే చివరి యుద్ధం అవుతుందని పేర్కొన్నాడు. ‘‘నేను సెప్టెంబర్ 11 (2001లో 9/11 అమెరికాపై అల్ ఖైదా దాడి) తర్వాత ఒక రోజు మా తాతను కలవడానికి వెళ్లాను. అప్పుడు ఆయన వయసు 96 ఏళ్లు. నేను ఆయన్ను కలిసినప్పుడు, నన్ను చూసి ఆయన నవ్వకపోవడం అదే మొదటిసారి. తాను చదువుతున్న వార్తాపత్రికను పక్కన పెట్టేసి, నాతో ఈ మాట అన్నారు. ‘అల్ ఖైదా ఇలాంటి దాడులు చేయగలిగినప్పుడు, అది మొత్తం ప్రపంచాన్ని కూడా ఆక్రమించగలదు’ అని చెప్పారు. అప్పుడు నేను మా తాతని శాంతింపజేసి.. ‘ఇది నేనిస్తున్నా హెచ్చరిక, ఉగ్రవాదాన్ని తప్పకుండా ఓడిస్తా’ అని ఆయనతో అన్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ని కొనసాగిస్తూ.. ‘ఇది గాజాకు ఆఖరి యుద్ధం అవుతుంది’ అని హెచ్చరించారు.

నిజానికి.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఎన్నో హింసాత్మక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే.. గాజాపై ఇజ్రాయెల్ మునుపెన్నడూ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. తొలుత తమపై చేసిన ఎదురుదాడులకు తిరిగి కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ ఆక్రమించిన భూభాగాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి సంపాదించుకుంది. అటు.. హమాస్ రహస్య స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దళాలు కూల్చేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దాడులు జరపకుండా ఉండేందుకు గాను.. మొత్తం హమాస్ సంస్థనే అంతం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకెళ్తోంది. అలాగే.. గాజాని కూడా స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైతం.. ఈ యుద్ధంలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-09T21:57:31+05:30 IST