Muslim Prayers Ban: బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం ప్రార్థనలపై నిషేధం..?

ABN , First Publish Date - 2023-06-28T16:07:09+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు సామూహిక ప్రార్ధనలు నిర్వహించడంపై నిషేధం విధిస్తూ ఒక చట్టాన్ని ఇటలీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇరాక్‌లో 25 లక్షల మందు ముస్లింలు ఉండగా, సామూహిక ప్రార్థనలు అత్యధికంగా ప్రైవేటు ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ముసాయిదా చట్టం అమలులోకి వస్తే ఈ ప్రైవేటు ప్రాంతాలన్నీ మూతపడతాయి.

Muslim Prayers Ban: బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం ప్రార్థనలపై నిషేధం..?

రోమ్: బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు సామూహిక ప్రార్ధనలు (Muslim prayers) నిర్వహించడంపై నిషేధం (Ban) విధిస్తూ ఒక చట్టాన్ని ఇటలీ (Italy) ప్రభుత్వం తీసుకురానుంది. ఇరాక్‌లో 25 లక్షల మందు ముస్లింలు ఉండగా, సామూహిక ప్రార్థనలు అత్యధికంగా ప్రైవేటు ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ముసాయిదా చట్టం అమలులోకి వస్తే ఈ ప్రైవేటు ప్రాంతాలన్నీ మూతపడతాయి. ప్రధాన మంత్రి జాయోర్జియ మెలోని సారథ్యంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఈ బిల్లును రూపొందించింది.

ఇటలీలోని యూనియన్ ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిటీస్ అండ్ ఆర్గనైజేషన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో 1,217 ముస్లిం ప్రార్థనా ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో అధికారిక మసీదులు ఆరు మాత్రమే. తక్కినవనీ కల్చలర్ అసోసియేషన్లుగానే ఉన్నాయి. వీటిని ప్రార్థనా స్థలాలుగా వాడుకుంటున్నారు. వీటిలో పలు గ్యారేజీలు, గిడ్డంగలు అపార్ట్‌మెంట్లు, బేస్‌మెంట్లు కూడా ఉన్నాయి.

వ్యతిరేకించిన విపక్షాలు

కాగా, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక పార్థనలను నిషేధించాలనే అధికార పార్టీ ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ బిల్లు రాజ్యంగ వ్యతిరేకమని, వివక్షాపూరితమని ఆరోపించాయి. ఇది ప్రజల మత స్వేచ్ఛను హరించడమేనని యూసీఓఐఐ అధ్యక్షుడు యాసిన్ లఫ్రాం అన్నారు. అయితే, ఈ వాదనను బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఎంపీ రోస్సీ తోసిపుచ్చారు. చట్టం అమలు అయితే, కల్చరల్ సెంటర్లు తమ ప్రదేశాన్ని ప్రార్థనలకు వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇటలీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్న మతస్వేచ్ఛను కొత్త చట్టం గౌరవిస్తుందని తెలిపారు.

Updated Date - 2023-06-28T16:08:35+05:30 IST