Share News

Kim Jong Un: మరోసారి బయటపడ్డ కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం.. జనరల్‌కి నరకానికి మించిన భయంకరమైన శిక్ష

ABN , First Publish Date - 2023-10-17T15:45:04+05:30 IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే చాలు..

Kim Jong Un: మరోసారి బయటపడ్డ కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం.. జనరల్‌కి నరకానికి మించిన భయంకరమైన శిక్ష

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే చాలు.. వారికి భయంకరమైన శిక్షలు విధిస్తాడు. బహుశా నరకంలో కూడా అలాంటి శిక్షలు ఉండవేమో. కొవిడ్ పాండెమిక్ సమయంలో కరోనా వచ్చిన ఓ వ్యక్తిని కాల్చి చంపించాడంటే, కిమ్ ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. తన విధానాలకు వ్యతిరేకంగా చిన్న పొరపాటు చేసినా సరే.. మరణశిక్ష తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వస్తున్నా.. కిమ్ పాపాల పుట్టకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా అతడు ఒక జనరల్‌కి విధించిన శిక్ష గురించి తెలిస్తే.. అతడ్ని నోటికొచ్చినట్టు తిట్లతో తిట్టిపోస్తారు.


మిర్రర్ నివేదిక ప్రకారం.. జనరల్ స్థాయి అధికారి ఒకరు కిమ్ జోంగ్ ఉన్‌పై తిరుగుబాటుకు పన్నాగం పన్నుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అతని కుట్ర గురించి తెలుసుకున్న కిమ్.. మరో క్షణం ఆలస్యం చేయకుండా అతనికి అత్యంత దారుణమైన శిక్ష విధించాడు. కిమ్‌పై తిరుగుబాటు అంటే.. ఉత్తర కొరియాలో దేశద్రోహంతో సమానమే. ఈ అధికారి కూడా దేశద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడ్ని పైశిచాకంగా హత్య చేశారు. మొదటగా ఆ జనరల్ కాళ్లు, చేతులు, తలను నరికేశారు. అనంతరం మృతదేహాన్ని పిరాన్హా (అత్యంత ప్రమాదకరమైన చేపలు) చేపలకు ఆహారంగా వేశారు. పిరాన్హా చేపలతో నిండిన భారీ ఫిష్ ట్యాంక్.. కిమ్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసినట్టు తెలిసింది. 1977లో విడుదల అయిన జేమ్స్ బాండ్ సినిమా ‘ది స్పై హూ లవ్డ్ మీ’లోనూ విలన్ తన ప్రత్యర్థుల్ని ఇలాగే షార్క్ చేపలున్న ఆక్వేరియంలో వేసి చంపుతుంటాడు. ఆ సన్నివేశం చూసిన తర్వాతే దేశద్రోహులకు అలాంటి శిక్ష వేయాలన్న ఆలోచన కిమ్‌కు వచ్చింది.

కిమ్ ఇలాంటి భయంకరమైన శిక్షలను తన అధికారులకు విధించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలామందిని రకరకాల శిక్షల ద్వారా అతడు హత్య చేశాడు. 2019లోనూ ఓ అధికారి తిరుగుబాటుకు కుట్ర పన్నాడని తెలిసి.. అతనికి ఉరిశిక్ష విధించాడు. ఇలా 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా ఆరోపణల్లో మొత్తం 16 మంది అధికారుల్ని అత్యంత దారుణంగా కిమ్ చంపించాడు. పులులకు ఆహారంగా ఇవ్వడం, కుక్కలకు ఎరగా వేయడం, సజీవదహనం చేయడం వంటి క్రూరమైన శిక్షలు కిమ్ విధిస్తుంటాడు. తాజాగా ఓ అధికారిని పిరాన్హా చేపలకు ఆహారంగా వేసే శిక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ అధికారి ఎవరన్న వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు.

Updated Date - 2023-10-17T15:45:04+05:30 IST