Share News

Alcohol Allergy: మందు తాగి రక్తం కక్కుకున్న యువతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

ABN , First Publish Date - 2023-12-11T16:10:17+05:30 IST

పరిమితికి మించి మద్యం సేవించినప్పుడు గానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించనప్పుడు కనీసం ఒక పెగ్గు వేసుకున్నా గానీ.. వాంతులు రావడం సహజం. కాబట్టి.. ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటే..

Alcohol Allergy: మందు తాగి రక్తం కక్కుకున్న యువతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

Poppy Beguely Story: పరిమితికి మించి మద్యం సేవించినప్పుడు గానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించనప్పుడు కనీసం ఒక పెగ్గు వేసుకున్నా గానీ.. వాంతులు రావడం సహజం. కాబట్టి.. ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటే.. పరిస్థితి యథాతథంగా మారుతుందని భావిస్తారు. కానీ.. ఒక యువతి విషయంలో అలా జరగలేదు. మొదట్లో తనకు ఆల్కహాల్ ఎలర్జీ అని భావించింది కానీ.. తీరా చూస్తే భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చెకప్ చేయించుకున్నప్పుడు.. తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఆ యువతి పేరు పాపీ బెగ్లీ. న్యూజిలాండ్‌కు చెందిన ఈ టీనేజర్ 2021లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినప్పుడు.. ఒక్కసారిగా వాంతులు వచ్చాయి. అలాగే.. ముఖంపై దుద్దర్లు, ముక్కులో పుండ్లు వచ్చాయి. బహుశా తాను అతిగా మద్యం సేవించడం వల్లే ఇలా జరిగి ఉంటుందని ఆమె అనుకుంది. అందుకే పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఒకరోజు బెగ్లీకి విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు నోట్లో నుంచి రక్తం కారింది. దాంతో భయభ్రాంతులకు గురైన ఆమె.. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు చికిత్స నిర్వహించిన అనంతరం.. ఆమె క్యాన్సర్ బారిన పడిందని తేలింది. ఒక సంవత్సరం తర్వాత హాడ్కిన్స్ లింఫోమాతో బెగ్లీ బాధపడుతున్నట్టు వెల్లడైంది.


ఈ మొత్తం వ్యవహారంపై పాపీ బెగ్లీ మాట్లాడుతూ.. ‘‘2021లో అనారోగ్యానికి గురయ్యే ముందు నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేదాన్ని. వారితో సరదాగా గడుపుతూ మద్యం కూడా సేవించేదాన్ని. మరుసటి రోజు వరకు ఎలాంటి సమస్య ఉండేది కాదు కానీ, ఆ తర్వాత సడెన్‌గా తలనొప్పి వచ్చేది. ఆ తర్వాత మళ్లీ కోలుకునేదాన్ని. కొన్నిరోజులు గడిచాక నేను మద్యం సేవించగానే.. వాంతులు రావడం ప్రారంభమైంది. అది కూడా మూడు పెగ్గులు తీసుకున్నాకే! ఆ మరుసటి రోజు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యేది. తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. బహుశా ఆల్కహాల్ అలెర్జీ వల్లే ఇలా అవుతుందని అప్పుడు అనుకున్నాను’’ అని చెప్పింది.

ప్రతిసారి ఇలాగే జరుగుతుండటంతో తాను 2022లో స్నేహితులతో కలిసి ఆసుపత్రిలో చేరానని, అప్పుడు ఎగ్జిమా & డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు తలెత్తాయని వైద్యులు చెప్పారని బెగ్లీ పేర్కొంది. తాను ఎన్ని క్రీజులు వాడినా, ట్యాబ్లెట్లు తీసుకున్నా.. తన సమస్య తగ్గలేదని చెప్పింది. తన మెడ వద్ద గడ్డగా ఏర్పడటం స్టార్ట్ అయ్యిందని.. అప్పుడు ఓ వైద్యుడ్ని సంప్రదించగా, తనకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పాడని వివరించింది. నాలుగు నెలల కఠోర చికిత్స తర్వాత చివరిసారిగా కీమోథెరపీ చేయించుకున్నానని చెప్పుకొచ్చింది. యూఎస్‌లోని ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగేందుకు తన కథన పంచుకున్నట్టు బెగ్లీ తెలిపింది.

Updated Date - 2023-12-11T16:10:18+05:30 IST