Share News

Ranil Wickremesinghe: దేశం సంక్షోభం నుంచి బయటపడలేదు.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-11-13T21:43:46+05:30 IST

శ్రీలంక(Srilanka) పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదని ఆ దేశ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) వెల్లడించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Srilanka Budjet)ను ఆ దేశ పార్లమెంట్ లో ఆయన ఇవాళ ప్రవేశ పెట్టారు.

Ranil Wickremesinghe: దేశం సంక్షోభం నుంచి బయటపడలేదు.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ కామెంట్స్

కొలంబో: శ్రీలంక(Srilanka) పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) వెల్లడించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Srilanka Budjet)ను ఆ దేశ పార్లమెంట్ లో ఆయన ఇవాళ ప్రవేశ పెట్టారు. నగదు కొరత ఉన్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునే వరకు కఠినమైన సంస్కరణలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.


బడ్జెట్ ప్రసంగంలో ఇంకా మాట్లాడుతూ.. "మేము గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి తీసుకురాగలిగాం. ఇప్పటికీ, ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారు. 2022 సెప్టెంబర్‌లో 70 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబర్‌లో 1.5 శాతానికి తగ్గింది. ద్వీప దేశం మరోసారి దివాళా తీయకుండా ఉండాలంటే కఠిన సంస్కరణలు తప్పనిసరి. ప్రభుత్వరంగ సంస్థల నష్టాలను పూడ్చేందుకు రాష్ట్ర బ్యాంకులను ఏర్పాటు చేశాం. నగదు కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం. 1.3 మిలియన్ల రాష్ట్ర ఉద్యోగులకు రూ.10 వేలు, 7 లక్షల మంది పెన్షనర్లకు రూ.3,000 జీవన వ్యయ భత్యాలు పెంచనున్నాం. ప్రభుత్వం ఇకపై డబ్బును ముద్రించదు. రాష్ట్ర ఖర్చుల కోసం బయటి నుంచి రుణాలు పొందలేం. పెట్టుబడులకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు నిరసనలు చేయడం సరికాదు. ఈ బడ్జెట్ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించింది కాదు" అని అన్నారు. శ్రీలంకలో 2024 సెప్టెంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-11-13T21:45:01+05:30 IST