Aliens Attack: ఆ ఊరిలో ‘ఏలియన్స్’ సంచారం.. ఓ యువతిపై దాడి చేసి పరార్.. భయాందోళనలో గ్రామస్థులు

ABN , First Publish Date - 2023-08-12T17:35:51+05:30 IST

ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? లేవా? ఈ మిస్టీరియస్ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం దొరకలేదు. ఇతర గ్రహాల్లో కచ్ఛితంగా గ్రహాంతరవాసులు ఉంటాయని చాలామంది నమ్మకాల్ని వెలిబుచ్చుతున్నారు..

Aliens Attack: ఆ ఊరిలో ‘ఏలియన్స్’ సంచారం.. ఓ యువతిపై దాడి చేసి పరార్.. భయాందోళనలో గ్రామస్థులు

ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? లేవా? ఈ మిస్టీరియస్ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం దొరకలేదు. ఇతర గ్రహాల్లో కచ్ఛితంగా గ్రహాంతరవాసులు ఉంటాయని చాలామంది నమ్మకాల్ని వెలిబుచ్చుతున్నారు. కొందరైతే.. మన భూమండలంలోనే మానవ రూపంలో ఏలియన్స్ సంచరిస్తున్నాయని వాదిస్తుంటే, మరికొందరు వీటిని తోసిపుచ్చుతున్నారు. ఏదేమైనా.. అప్పుడప్పుడు మన భూమిపై కొన్ని వింత సంఘటనలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. వింత ఆకారంలో ఉండే జీవులు కంటికి కనిపించినట్టే కనిపించి, మాయమవుతున్నాయి. ఇప్పుడు ఓ ఊరిలోనూ వింతజీవులు భయానక వాతావరణం సృష్టించాయి. అక్కడ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడమే కాదు.. ఓ 15 ఏళ్ల అమ్మాయిపై దాడి కూడా చేశాయి. దీంతో.. అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


అది పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఒక చిన్న గ్రామం. అక్కడ గిరిజనులు నివసిస్తారు. నిన్నటిదాకా ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ గ్రామాన్ని భయానక పరిస్థితులు అలుముకున్నాయి. ఇందుకు కారణం.. అక్కడ సంచరిస్తున్న వింత జీవులే. అవి చూడ్డానికి ‘స్పైడర్-మాన్’ సినిమాలోని గ్రీన్ గాబ్లిన్ తరహాలో కనిపిస్తాయని ఆ గ్రామస్థులు అంటున్నారు. ఏడు అడుగులు ఎత్తుంటే ఆ జీవుల కళ్లు పసుపు రంగులో ఉంటాయన్నారు. వాటి తలలు చాలా పొడవుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అవి జనాల మధ్యలోకి అకస్మాత్తుగా వచ్చి, దాడులు చేసి పారిపోతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా.. అవి మనుషుల ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. నెల రోజుల క్రితం ఈ వింత జీవులు 15 ఏళ్ల బాలికపై దాడి చేశాయన్నారు. వెనుక నుంచి ఆ బాలికను పట్టుకోగా ఆమె ప్రతిఘటించిందని, దాంతో ఆమె మెడ కోసుకుపోయిందని తెలిసింది. ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర అస్వస్థకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీళ్లు హుడీ ధరించడంతో పాటు ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్నాయని గ్రామస్థుల వాదన.

ఇవి గ్రహాంతరవాసులా? లేక మనుషులే ఇలాంటి వింత రూపం ధరించి చేస్తున్నారా? అనేది స్పష్టంగా తెలియదు కానీ.. ఈ వింత జీవుల దాడులతో ఆ ప్రాంతం మొత్తం గడగడలాడుతోంది. ఇవి రాత్రిపూట ఊరిలో సంచరిస్తూ.. భయానక పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, ముసలివారిని టార్గెట్ చేసుకొని.. దాడులకు దిగుతున్నాయి. రాత్రిపూటే ఇవి బయటకొస్తున్న తరుణంలో.. వాటి రూపాల్ని సరిగ్గా గమనించలేకపోతున్నారు. వీటి నుంచి స్థానికులకు రక్షణ కల్పించేందుకు.. రాత్రిపూట ఊరి బయట కొందరు కాపలాగా ఉంటున్నారు. ఈ గిరిజన నాయకుడైన జైరో రేటెగుయ్ అవిలా మాట్లాడుతూ.. తాను ఆ వింతజీవుల్లో ఒకదాన్ని గన్‌తో రెండుసార్లు కాల్చానని, అయితే దానికి ఎలాంటి గాయం కాలేదని తెలిపాడు. అవి కచ్ఛితంగా ఏలియన్స్ అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. తాము ఈ విషయంపై పెరు అధికారులకు సమాచారం అందించామని, మిలిటరీ నుంచి కూడా సహాయం కోరామని చెప్పాడు.

Updated Date - 2023-08-12T17:35:51+05:30 IST