Helicopter Crash: ఆకాశంలో యాక్సిడెంట్.. కార్చిచ్చుని ఆపబోయి ఢీకొన్న హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2023-08-07T21:26:59+05:30 IST

కేవలం భూమి మీదే కాదు, అప్పుడప్పుడు ఆకాశంలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కాదు, కమ్యునికేషన్ లోపాల వల్ల ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది.

Helicopter Crash: ఆకాశంలో యాక్సిడెంట్.. కార్చిచ్చుని ఆపబోయి ఢీకొన్న హెలికాప్టర్లు

కేవలం భూమి మీదే కాదు, అప్పుడప్పుడు ఆకాశంలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కాదు, కమ్యునికేషన్ లోపాల వల్ల ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన రెండు హెలికాప్టర్లు.. అనుకోకుండా పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.


ఆదివారం కాలిఫోర్నియాలోని కాబాజోన్‌ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించింది. ఇందుకు కారణం ఏంటో తెలీదు కానీ, ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అది క్రమంగా వ్యాప్తి చెందుతూ.. కార్చిచ్చుగా మారింది. దీంతో.. అధికారులు ఆ కార్చిచ్చుని ఆర్పేందుకు రంగంలోకి దిగారు. దీనిని ఆర్పడం కింద ఫైరింజన్లతో సాధ్యం కాదు కాబట్టి.. రెండు హెలికాప్టర్లను పంపారు. ఆ హెలికాప్టర్లను మంటల్ని అదుపు చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాయి. కానీ.. దట్టమైన పొగ కారణంగా, ఎటువైపు ప్రయాణిస్తున్నామో ఆ రెండు హెలికాప్టర్ల పైలట్లకు అర్థం కాలేదు. ఈ నేపథ్యంలోనే అవి ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయని కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం ప్రతినిధి రిచర్డ్‌ కోర్డోవా తెలిపారు. ఒక హెలికాప్టర్ సేఫ్‌గా ల్యాండ్ అవ్వగా, మరో హెలికాప్టర్ పూర్తిగా కుప్పకూలిందని అన్నారు.

ఈ ఘటనపై రిచర్డ్ మాట్లాడుతూ.. ‘‘కార్చిచ్చు అంటుకుందన్న సమాచారం రాగానే, మంటల్ని ఆర్పేందుకు రెండీ హెలికాప్టర్లను పంపించాం. కానీ.. దట్టమైన పొగల కారణంగా పైలట్లను కనిపించకపోవడంతో, ఎదురెదురుగా వచ్చి హెలికాప్టర్లు ఢీకొట్టుకొని ఉంటాయని భావిస్తున్నాం. సరైన కారణాలు ఇంకా వెలుగులోకి రాకపోవడంతో, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. ఎయిర్‌ ఎమర్జెన్సీ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-08-07T21:26:59+05:30 IST