Donald Trump: ట్రంప్‌కు ఒకే ఒక ఓటు.. ప్రతినిధుల సభలో భలే సీన్..

ABN , First Publish Date - 2023-01-06T20:51:24+05:30 IST

అమెరికాకు మరోసారి అధ్యక్షుడు కావాలని కలలుకంటున్న డోనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభలో ఒకే ఒక ఓటు వచ్చింది.

Donald Trump:  ట్రంప్‌కు ఒకే ఒక ఓటు.. ప్రతినిధుల సభలో భలే సీన్..

ఎన్నారై డెస్క్: అమెరికాకు మరోసారి అధ్యక్షుడు కావాలని కలలుకంటున్న డోనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) ప్రతినిధుల సభలో(House of Representatives) ఒకే ఒక ఓటు(One vote) వచ్చింది. ఇది చూసి సభికులు గొల్లున నవ్వారు. స్పీకర్ ఎన్నికల(Speaker Elections) సందర్భంగా ప్రతినిధుల సభలో ఈ హాస్యభరిత సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్ పదవికి జరుగుతున్న ఎన్నికలు గురువారం కూడా కొనసాగాయి. సభలో రిపబ్లికన్లదే ఆధిపత్యం. 435 మంది సభ్యులున్న సభలో రిపబ్లికన్ల(Republicans) సంఖ్య 222. డెమోక్రాట్ల(Democrats) సంఖ్య 212. రిపబ్లికన్ల తరపున మెక్ కార్తీ బరిలోకి దిగారు. ఆయనకు ట్రంప్ మద్దతు కూడా ఉంది. అంతకుమునుపు మూడు రోజులుగా పలు రౌండ్ల ఓటింగ్ జరిగినా రిపబ్లికన్లు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయారు.

రిపబ్లికన్లలో కొందరు మెక్‌కార్తీని వ్యతిరేకిస్తుండటతో మెజారిటీకి ఆయన కొద్ది దూరంలో నిలిచిపోయారు. తమకు మెక్‌కార్తీ ఇష్టంలేదని మరింత స్పష్టంగా చెప్పేందుకు సభ్యుల్లో ఒకరు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు కేవలం ఒక్క ఓటు దక్కడంతో సభ అంతా నవ్వులతో నిండిపోయింది. ట్రంప్ కూడా ఈ ఘటనపై హుందాగా వ్యవహరించారు. తాను స్పీకర్ సీట్లో కూర్చున్న ఫొటోను తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. తన ముందు నిలబడ్డ బైడెన్ స్పీచ్ ఇస్తుండగా ఆయన వెనకున్న ట్రంప్ నాలికబయటపెట్టి కామెడీ చేస్తున్నట్టు ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-01-07T00:03:17+05:30 IST