USA: టీచర్‌పై ఆరేళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు.. వెలుగులోకి మరో షాకింగ్ విషయం..

ABN , First Publish Date - 2023-01-10T19:12:58+05:30 IST

అమెరికాలో కలకలం రేపుతున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడి కాల్పుల ఘటనలో మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది.

USA: టీచర్‌పై ఆరేళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు.. వెలుగులోకి మరో షాకింగ్ విషయం..

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) కలకలం రేపుతున్న టీచర్‌పై(Teacher) ఆరేళ్ల బాలుడి కాల్పుల ఘటనలో మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. కావాలనే బాలుడు టీచర్‌ను తుపాకీతో కాల్చినట్టు తాజాగా బయటపడింది. వర్జీనియా రాష్ట్రం(Virginia) న్యూపోర్టు న్యూస్ నగరంలోని(Newport News) రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో శుక్రవారం ఆరేళ్ల బాలుడు ఎబీ జ్వెర్నర్ అనే ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాడు. ‘‘నాపై కాల్పుల జరిపాడు అంటూ ఆమె కుప్పకూలిపోంది’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత ఆమెకు చేయిపై గాయమైందనుకున్నామని, కానీ ఆమె నేలపైపడి స్పృహ కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీచర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం టీచర్ పరిస్థితి మెరుగైందని, తన కుటుంబసభ్యులతో మాట్లాడారని స్కూల్ వెబ్‌సైట్‌లో యాజమాన్యం పేర్కొంది. విద్యార్థి ఒక రౌండ్ మాత్రమే కాల్చాడని, ఈ ఘటనలో ఇతర విద్యార్థుల పాత్ర ఏమీ లేదని పోలీసులు తెలిపారు. బీబీసీ కథనం ప్రకారం.. తూటా బాధితురాలి చేయిలో నుంచి ఛాతిపై భాగంలోకి దూసుకుపోయింది. అంత బాధలోనూ ఆమె ఇతర విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే సాయం కోసం పోలీసులకు ఫోన్ చేశారని బీబీసీ పేర్కొంది. అయితే.. విద్యార్థి తుపాకీ ఎలా సంపాదించాడో ఇంకా స్పష్టత రాలేదు.

Updated Date - 2023-01-10T19:13:00+05:30 IST