Share News

Palestine - Israel: త్రిశూల వ్యూహంతో వెళ్తున్న ఇజ్రాయెల్.. హమాస్‌ అంతమే ఫస్ట్ టార్గెట్

ABN , First Publish Date - 2023-10-15T12:29:10+05:30 IST

ఇజ్రాయెల్ పై ఆకస్మిక మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో ఇజ్రాయెలియన్లను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం పాలస్తీనా(Palestine - Israel)పై మెరుపు దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Palestine - Israel: త్రిశూల వ్యూహంతో వెళ్తున్న ఇజ్రాయెల్.. హమాస్‌ అంతమే ఫస్ట్ టార్గెట్

జెరూసలెం: ఇజ్రాయెల్ పై ఆకస్మిక మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో ఇజ్రాయెలియన్లను హతమార్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం పాలస్తీనా(Palestine - Israel)పై మెరుపు దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హమాస్(Hamas) మిలిటెంట్లను తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అదే టైంలో విపరీతమైన భూతల దాడులతో గాజా నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకురావడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.


మొత్తంగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడం, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడం, గాజాను స్వాధీనం చేసుకోవడం.. ఇలా త్రిశూల వ్యూహంతో ఇజ్రాయెల్ సాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే గాజాపై భూ, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఏకకాలంలో దాడులు చేసేందుకు సిద్ధం అవుతోంది. 2006 తరువాత ఇజ్రాయెల్ చేస్తున్న భారీ ఆపరేషన్ ఇదే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మూడు మార్గాల్లో దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆ దేశ సైన్యం గాజా సరిహద్దు వెంట పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించి, చివరి కమాండ్ ఆదేశాల కోసం ఎదురు చేస్తోంది. హమాస్ ను నాశనం చేయడం, వారి చేతిలో మరణించిన ప్రతి ప్రాణానికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఐడీఎఫ్ ప్రధాన ప్రతినిధి డేనయల్ హగారి స్పష్టం చేశారు.


హమాస్ లకు కంచుకోటగా ఉన్న గాజాను తొలుత బాంబులతో దెబ్బ తీసి హమాస్ టెర్రరిస్టులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

సరిహద్దుల్లో 30 వేల మంది సైన్యం..

ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా సరిహద్దులో 30 వేల మంది సైనికులను మోహరించింది. వారు ముఖ్యమైన గ్రౌండ్ ఆపరేషన్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 10వేల మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు.

Updated Date - 2023-10-15T12:30:13+05:30 IST