Share News

Hindan base: భారత వాయుసేన స్థావరం ప్రహరీగోడ కింద భారీ గొయ్యి.. ఒక్కసారిగా కలకలం

ABN , First Publish Date - 2023-12-11T16:55:25+05:30 IST

దేశరాజధాని ఢిల్లీ భద్రతకు కీలకమైన హిందన్ వాయుసేన స్థావరం ప్రహరీ గోడ కింద భారీ గొయ్యి బయటపడటం కలకలానికి దారి తీసింది.

Hindan base: భారత వాయుసేన స్థావరం ప్రహరీగోడ కింద భారీ గొయ్యి.. ఒక్కసారిగా కలకలం

ఇంటర్నెట్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీ (New Delhi) గగనతల భద్రతకు కీలకమైన హిండన్ వాయుసేన స్థావరం (Hindan Airbase) ప్రహరీ గోడ కింద భారీ గొయ్యి బయటపడటం కలకలానికి దారి తీసింది. ఢిల్లీకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఘాజియాబాద్‌లో ఈ స్థావరం ఉంది. ఎయిర్‌బేస్ ప్రహరీ గోడ కింద నాలుగు అడుగుల మేర లోతున్న గొయ్యిని (4 feet deep pit) స్థానికులు కనుగొని అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొయ్యిని మట్టితో పూడ్చేశారు. అయితే, ఈ ఘటనపై వాయుసేన ఇంకా స్పందించాల్సి ఉంది.


వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు (Western aircommand) చెందిన ఈ వాయుసేన స్థావరం రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల రక్షణ బాధ్యతలు ఈ ఎయిర్ బేస్ పరిధిలోనివే. దేశంలోని భారీ మిలిటరీ రవాణా విమానం సీ-17 ఈ స్థావరం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

హిండన్ ఎయిర్ బేస్ చుట్టూ భారీ నివాస సముదాయం ఉంది. ఇక గొయ్యిని గుర్తించిన ప్రాంతంలో మైదానం ఉండగా దానికి ఆవల నివాస సముదాయాలు ఉన్నాయి. అయితే, స్థానికంగా దొంగతనాలు దోపిడీలు ఈ మధ్య ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. వ్యసనపరులు, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కీలక వాయుసేన స్థావరం పరిసరాల్లో ఇంత భారీ గొయ్యి బయటపడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Updated Date - 2023-12-11T17:02:43+05:30 IST