Karnataka assembly elections : జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ ప్రచారం
ABN , First Publish Date - 2023-04-22T04:12:07+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్.. తన మిత్రపక్షమైన జేడీఎ్‌సకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్.. తన మిత్రపక్షమైన జేడీఎ్‌సకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిద్దిపేటలో ఓ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జేడీఎ్‌సకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానన్నారు. మే నెల 10న కర్ణాటకలో పోలింగ్ ఉండగా.. ఈనెల 29 తర్వాత బీఆర్‌ఎస్ మంత్రులు, ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్తారని పార్టీలో చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లోనే జేడీఎస్ తరఫున ప్రచారం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. దీనిపై పార్టీ ఎటువంటి నిర్ణయాలను ప్రకటించనప్పటికీ.. బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టి తన మిత్రపక్షానికి మేలు చేసేందుకు ప్రయత్నించాలని బీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఔరంగాబాద్ సభకు భారీ ఏర్పాటు
మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు పార్టీలు, సంఘాల నాయకులు బీఆర్‌ఎ్‌సలో స్వచ్ఛందంగా చేరుతున్నారని పీయూసీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఈనెల 24న ఔరంగాబాద్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసున్నట్లు తెలిపారు.