లాలూ కుటుంబానికి ఢిల్లీ కోర్టు బెయిల్‌

ABN , First Publish Date - 2023-10-05T02:28:38+05:30 IST

ఉద్యోగాలివ్వడానికి భూములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో...

లాలూ కుటుంబానికి ఢిల్లీ కోర్టు  బెయిల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 4: రైల్వే ఉద్యోగాలివ్వడానికి భూములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆర్‌జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ వ్యవహారంలో కోర్టు గత నెల 22న వారికి సమన్లు జారీచేసింది. వారు కోర్టుకు హాజరు కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్‌ బెయిల్‌ ఇచ్చారు. సీబీఐ కూడా దీనిని వ్యతిరేకించలేదు. ముగ్గురూ రూ.50 వేల చొప్పున బెయిల్‌ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-10-05T02:28:38+05:30 IST