Parliament: పార్లమెంట్ ఘటన.. 8 మందిని సస్పెండ్ చేసిన అధికారులు
ABN , Publish Date - Dec 14 , 2023 | 01:15 PM
పార్లమెంట్‌లో బుధవారం(Parliament Security Breach) జరిగిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. లోక్‌సభ(Parliament Sessions) నడుస్తుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకి యెల్లో కలర్ స్మోక్ వదిలాడు.
ఢిల్లీ: పార్లమెంట్‌లో బుధవారం(Parliament Security Breach) జరిగిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. లోక్‌సభ(Parliament Sessions) నడుస్తుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకి యెల్లో కలర్ స్మోక్ వదిలాడు. అయితే అతన్నిఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మందిపై అధికారులు చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వారిలో ప్రదీప్, , రాంపాల్, అరవింద్, గణేశ్, నరేంద్ర, అనిల్, విమిత్, వీరదాస్ ఉన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనక ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా.. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
అరెస్టయిన వారిలోడీ మనోరంజన్, సాగర్, అమోల్ షిండే, నీలందేవి, విశాల్‌ను బుధవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు విశాల్‌ను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు.
పాస్‌లు జారీ అయింది ఇలాగే..
లోక్‌సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్‌లు జారీ అయ్యాయి. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. లోక్‌సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్ మైసూరుకు చెందిన వాడని, తరచూ ఎంపీ ఆఫీసుకు వస్తుండేవాడని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్ పాస్ కోసం మనోరంజన్ మూడు నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సభలో బెంచ్‌లపై నుంచి దూకుతూ స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన సాగర్ శర్మను మనోరంజన్ తన స్నేహితుడని చెప్పి, పాస్ తీసుకున్నట్లు గుర్తించారు.
కొత్త పార్లమెంటును చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి, వీరు పాస్‌లు తీసుకున్నారు. బుధవారం సింహా తరఫున మొత్తం మూడు పాస్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్‌లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.