అవినీతి కేసుల్లో ఉన్నతాధికారులకు మినహాయింపుల్లేవ్‌

ABN , First Publish Date - 2023-09-12T02:31:56+05:30 IST

అవినీతి కేసుల విచారణ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇంతవరకు ఉన్న మినహాయింపులను సోమవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అవినీతి కేసుల్లో ఉన్నతాధికారులకు  మినహాయింపుల్లేవ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: అవినీతి కేసుల విచారణ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇంతవరకు ఉన్న మినహాయింపులను సోమవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే జాయింట్‌ సెక్రటరీ ఆపై స్థాయి అధికారులను విచారించడంతోపాటు ప్రాసిక్యూట్‌ చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుకటి తేదీ నుంచి అంటే 2003 సెప్టెంబరు 11 నుంచే అమల్లోకి వచ్చినట్టుగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. 2004లో లంచం తీసుకుంటుండగా ఢిల్లీలోని ప్రధాన జిల్లా వైద్యాధికారిని సీబీఐ పట్టుకొని అరెస్టు చేసింది. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా తనపై విచారణ జరపరాదని ఆయన హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.

Updated Date - 2023-09-12T02:31:56+05:30 IST