Visa: మీకు పాస్‌పోర్ట్ ఉందా? అయితే ఈ దేశాలకు వీసా అక్కర్లేకుండానే వెళ్లి రావొచ్చు..
ABN , Publish Date - Dec 13 , 2023 | 08:11 PM
మీకు పాస్‌పోర్ట్ ఉందా? అయితే మీకో శుభవార్త.. వీసాలు తీసుకునే అవసరం లేకుండా భారతీయులు వెళ్లి వచ్చే దేశాల సంఖ్య తాజాగా పెరిగింది. ఇప్పటివరకు కేవలం పాస్‌పోర్ట్‌తో భారతీయులను అనుమతించే దేశాలు 23 ఉండేవి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరాయి.
మీకు పాస్‌పోర్ట్ ఉందా? అయితే మీకో శుభవార్త.. వీసాలు తీసుకునే అవసరం లేకుండా భారతీయులు వెళ్లి వచ్చే దేశాల సంఖ్య తాజాగా పెరిగింది. ఇప్పటివరకు కేవలం పాస్‌పోర్ట్‌తో భారతీయులను అనుమతించే దేశాలు 23 ఉండేవి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరాయి. దీంతో భారతీయులను వీసాలు లేకుండానే అనుమతించే దేశాల సంఖ్య మొత్తం 29కి చేరింది.
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు అంగోలా, బార్బడోస్, భూటాన్, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గాబోన్, గాంబియా, గ్రెనడా, హైతీ, జమైకా, కజకిస్తాన్, కిరిబాటి, మకావు, మారిషస్, మైక్రోనేషియా, నేపాల్, పాలస్తీనియన్ టెరిటరీలు, సెయింట్ కిట్స్, నెవిసియన్, సెనెగల్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు వంటి దేశాలు ఎప్పట్నుంచో భారతీయులకు వీసా-ఫ్రీ ప్రవేశం కల్పించాయి. తాజాగా శ్రీలంక, థాయిలాండ్, మలేషియా కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు వీసా-ఫ్రీ ప్రవేశాన్ని అనుమతిస్తున్నాయి